షాకింగ్‌.. ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. | Bengaluru College Students Chant Pakistan Zindabad Suspended | Sakshi
Sakshi News home page

షాకింగ్.. ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో 'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు.. ముగ్గురు విద్యార్థులు సస్పెండ్‌..

Nov 19 2022 3:51 PM | Updated on Nov 19 2022 3:51 PM

Bengaluru College Students Chant Pakistan Zindabad Suspended - Sakshi

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులోని న్యూ హారిజన్ ఇంజినీరింగ్ కాలేజీలో ముగ్గురు విద్యార్థులు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొట్టడంతో కళాశాల యాజమాన్యం ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేసింది. వాళ్ల తల్లిదండ్రులుకు కూడా నోటీసులు పంపింది. 

మరోవైపు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే వీళ్లు కావాలాని ఈ నినాదాలు చేయలేదని, సరదాగా చేసి ఇబ్బందుల్లో పడ్డారని పోలీసులు తెలిపారు.

కాలేజీలో ఫెస్ట్..
అయితే ఈ కాలేజీలో నవంబర్ 25,26 తేదీల్లో ఇంటర్-కాలేజ్ ఫెస్ట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులంతా తమకు నచ్చిన ఐపీఎల్ జట్లు, వివిధ దేశాల పేర్లతో నినాదాలు చేశారు. ఈ సమయంలోనే ముగ్గురు విద్యార్థులు ఆర్యన్, దినకర్, రియా.. సరదాగా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు. మరో విద్యార్థి వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా అలాగే నినాదాలు చేశారు. దీంతో కేసులో ఇరుక్కుని ఇబ్బందులపాలయ్యారు. వీరి వయసు 17-18 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
చదవండి: అది మసాజ్ కాదు.. ట్రీట్‌మెంట్‌.. జైలు వీడియోపై ఆప్‌ కౌంటర్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement