పోలీసుల అదుపులో ముగ్గురు
బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ భవనం విధానసౌధ కారిడార్లలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరు ఆర్‌టీ నగర వాసి మునావర్, బ్యాడగివాసి మహమ్మద్ షఫీనా శిపుడి అనే వారిని నిర్బంధించారు. ఫిబ్రవరి 27వ తేదీన విధానసౌధలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్, ఫలితాల వెల్లడి జరిగింది. ఆ సమయంలో బళ్లారి కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ గెలిచారు.
దీంతో ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. విధాన సౌధ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రదర్శనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. నినాదాలు చేసింది నిజమేనని పరీక్షల్లో తేలడంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సెంట్రల్ డీసీపీ శేఖర్ తెలిపారు. మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment