ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోని వలసలు, మథురలో చెలరేగిన ఘర్షణలు మరువకముందే అలీగఢ్ మత ఘర్షనలు చోటు చేసుకున్నాయి.
శాంతియుత పరిస్ధితులు నెలకొనేందుకు భద్రతా దళాలు కృషి చేస్తున్నాయి. ఇక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదని అందుకే ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోతున్నామని సుధా వర్షిణి (38) ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు పాఠశాలకు వెలుతుంటే కూడా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా మేజిస్టేట్ అవదేశ్ తివారీ వారికి రక్షణ కల్పిస్తామని అన్నారు.