![UP Woman Reports Physical Assault By Family Member - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/18/woman.jpg.webp?itok=Sir7ck0b)
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో మహిళలు, యువతులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కుటుంబ సభ్యులే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడంతో ఏళ్లు గడిచినా బాధితులు తమ ఆవేదనను బయటకి చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి యూపీలో చోటుచేసుకుంది. తండ్రే.. తన కూతురుపై 32 ఏళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన బాధితురాలు తండ్రి తన చిన్నతనంలోనే మరణించారు. దీంతో, తల్లి రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు బాధితురాలి వయస్సు ఏడేళ్లు. అనంతరం.. ఆమెపై కన్నేసిన తండ్రి.. బెదిరించి బలాత్కారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం తల్లికి చెబితే ఊరుకొమ్మని నోరు మూయించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న కసాయి తండ్రి.. మరింత రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో 2011లో ఆమెకు అలిగఢ్‌కు చెందిన ఓ జవానుతో వివాహం జరిగింది. తనకు వివాహం జరిగిన తర్వాతైన విముక్తి కలుగుతుందని భావించిన ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె.. పుట్టింటికి వచ్చిన ప్రతీసారి తన లైంగిక వాంఛను తీర్చుకుంటూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే భర్తపై తప్పుడు కేసులు బనాయించి జైలుపాలు చేస్తానని బెదిరించేవాడు. దీంతో, తన భర్త ఆమెను.. పుట్టింటికి వెళ్తావా అని అడిగిన ప్రతిసారీ భయంతో వణికిపోయేది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే తన భర్త ఆర్మీ నుంచి వీఆర్‌ఎస్ తీసుకొని అలిగఢ్‌లోనే ఓ చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓరోజున తనకు జరిగిన దారుణాన్ని భర్తకు చెప్పి బోరున ఏడ్చేసింది. ఆమె మాటలు విని షాకైన భర్త.. భార్యకు సపోర్టుగా నిలిచాడు. అనంతరం, వారిద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సవితా ద్వివేది మాట్లాడుతూ.. మహిళ ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్నాము. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment