ఆమే నా ప్రపంచం..  | Banwarilal Sharma Says She Was the World for Me | Sakshi
Sakshi News home page

ఆమే నా ప్రపంచం.. 

Published Sat, Jun 8 2019 2:38 PM | Last Updated on Sat, Jun 8 2019 3:33 PM

Banwarilal Sharma Says She Was the World for Me - Sakshi

మృతురాలి బంధువుల ఆ​క్రందన

అలీగఢ్‌ : తన కూతుర్ని కిరాతకంగా చంపిన దుర్మార్గులను బహిరంగంగా ఉరి తీయాలని అలీగఢ్‌ సమీపంలో హత్యకు గురైన చిన్నారి తండ్రి భన్వీలాల్‌ శర్మ డిమాండ్‌ చేశారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించివుంటే తన కూతురు బతికేది ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్‌ వెళ్లాలని ఎంతో ఆరాటపడిందని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా కూతురు చాలా తెలివైంది. స్వయంగా అక్షరాలన్నీ గుర్తుపడుతుంది. ఆమె నవ్వు చాలా బాగుంటుంది. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమే నా ప్రపంచంగా బతికాన’ని భన్వరీలాల్‌ చెప్పారు.

తమ కూతురు ఇంకా తమ చుట్టూ తిరుగుతున్నట్టే ఉందని, ఆమె మళ్లీ కనిపిస్తుందన్న ఆశతో జీవిస్తున్నట్టు చిన్నారి తల్లి శిల్పా శర్మ తెలిపారు. చిన్నారి హత్య మానవత్వానికి మాయని మచ్చ అయినప్పటికీ, ఈ దారుణోదంతం మత సామరస్యాన్ని దెబ్బతీయలేదని ఆమె బంధువు దశరథ్‌ శర్మ అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ సమీపంలోని టప్పల్‌ పట్టణంలో మూడేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనలో జహీద్, అస్లాం అనే నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. (చదవండి: పాశవిక హత్యపై ప్రకంపనలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement