Child murder
-
దారుణం.. మామిడిపండు అడిగిందని గొంతుకోసి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ శామ్లీలోని ఖేడా కుర్‌తార్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. అన్నం తినే సమయంలో మామిడిపండు అడిగిందనే కారణంతో ఐదేళ్ల మేనకోడల్ని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆమె పదే పదే మామిడిపండు కావాలని అడుగుతుందని చిరాకుపడి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నిందితుడు మొదట చిన్నారి తలపై రాడ్డుతో కొట్టాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. శవాన్ని సంచిలో చుట్టి ఇంట్లోనే దాచాడు. పాప కన్పించకపోయేసరికి గ్రామస్థులంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నిందితుడు కూడా ఏమీ తెలియన్నట్లు వారితో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడు. అయితే చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి నిందితుడిపై అనుమానం వచ్చింది. దీంతో అతడు గ్రామం వదిలి పారిపోయాడు. అతని ఇల్లు వెతికిన పోలీసులకు సంచిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టి గురువారం రాత్రి ఓ అడవి సమీపంలో అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనలో హత్యకు గురైన చిన్నారి పేరు ఖైరు నిషా.. కాగా నిందితుడి పేరు ఉమర్దీన్ అని పోలీసులు తెలిపారు. చదవండి: ఎన్నో కలలు..మరెన్నో ఆశలు.. పెళ్లై ఏడు నెలలు తిరగక ముందే.. -
ఆమే నా ప్రపంచం..
అలీగఢ్ : తన కూతుర్ని కిరాతకంగా చంపిన దుర్మార్గులను బహిరంగంగా ఉరి తీయాలని అలీగఢ్ సమీపంలో హత్యకు గురైన చిన్నారి తండ్రి భన్వీలాల్ శర్మ డిమాండ్ చేశారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించివుంటే తన కూతురు బతికేది ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్ వెళ్లాలని ఎంతో ఆరాటపడిందని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా కూతురు చాలా తెలివైంది. స్వయంగా అక్షరాలన్నీ గుర్తుపడుతుంది. ఆమె నవ్వు చాలా బాగుంటుంది. ఒక్కగానొక్క కూతురు కావడంతో ఆమే నా ప్రపంచంగా బతికాన’ని భన్వరీలాల్ చెప్పారు. తమ కూతురు ఇంకా తమ చుట్టూ తిరుగుతున్నట్టే ఉందని, ఆమె మళ్లీ కనిపిస్తుందన్న ఆశతో జీవిస్తున్నట్టు చిన్నారి తల్లి శిల్పా శర్మ తెలిపారు. చిన్నారి హత్య మానవత్వానికి మాయని మచ్చ అయినప్పటికీ, ఈ దారుణోదంతం మత సామరస్యాన్ని దెబ్బతీయలేదని ఆమె బంధువు దశరథ్ శర్మ అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ సమీపంలోని టప్పల్ పట్టణంలో మూడేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనలో జహీద్, అస్లాం అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: పాశవిక హత్యపై ప్రకంపనలు) -
పాశవిక హత్యపై ప్రకంపనలు
అలీగఢ్ (యూపీ)/ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేయడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓ వ్యక్తి రూ.10 వేలు అప్పు తీర్చలేదనే కారణంతో దుండగులు అభం శుభం తెలియని అతడి కుమార్తె (రెండున్నరేళ్లు)ను గొంతు పిసికి, కనుగుడ్లు పెరికి చంపి చెత్తకుప్పలో పారేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసింది. టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్ శర్మ టప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. రాహుల్, ప్రియాంక దిగ్భ్రాంతి ‘మనిషనే వారెవరైనా చిన్నారులపై ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?. పోలీసులు సత్వరం స్పందించి దోషులకు శిక్షలు పడేలా చూడాలి’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటన అమానవీయమని ప్రియాంకగాంధీ అన్నారు. ‘అందరూ సిగ్గుపడాల్సిన∙ఘటన’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్‌కుమార్, అభిషేక్, షబనా ఆజ్మీ, అనుపమ్ ఖేర్ తదితరులు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
అన్నానగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడు నెలల బిడ్డని గొంతు కోసి చెత్తకుప్పలో విసిరేసిన తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. బిడ్డను హత్య చేసి ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడింది. దిండుక్కల్, కొడైరోడ్డు సిరుమలై ప్రాంతానికి చెందిన కార్తీక్ (26). ఇతను కోవై శరవణంపట్టి ప్రాంతంలో ఉన్న రబ్బర్ పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య వనిత (22). వీరికి శశిప్రియ (2), మూడు నెలల కవిశ్రీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ స్థితిలో సోమవారం ఉదయం కార్తీక్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు. వనిత ఇద్దరు పిల్లలతో ఇంటిలో ఉంది. అప్పుడు సాయంత్రం 3 గంటల సమయంలో వనిత స్నానానికి వెళ్లి వచ్చింది. తరువాత ఆమె కేకలు వేస్తూ.. తన బిడ్డని ఎవరో కిడ్నాప్ చేశారని ఏడ్చింది. అనంతరం భర్తకు ఫోన్ ద్వారా సమాచారం తెలిపింది. దీంతో వెంటనే కార్తీక్ ఇంటికి వచ్చి కవిశ్రీని పలు స్థలాలలో వెతికారు. తర్వాత శరవణంపట్టి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వనితను విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం ఏర్పడింది. దీంతో పోలీసులు ఆమెని తీవ్రంగా విచారణ చేపట్టారు. ఇందులో వనిత బిడ్డను హత్య చేసినట్లుగా తెలిపింది. ఇది విన్న పోలీసులు, కార్తీక్ దిగ్భ్రాంతి చెందారు. ఈ కేసుపై పోలీసులు మాట్లాడుతూ వనితకి, పక్కింటికి చెందిన శ్రీనివాసన్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండకూడదని మొదటి కుమార్తె శశిప్రియని దిండుక్కల్ సిరుమలై ప్రాంతంలో ఉన్న తన కన్నవారి ఇంటిలో వదిలిపెట్టింది. మూడు నెలల పసికందు కవిశ్రీ తరచూ ఏడుస్తూ ఉండేది. దీంతో తన వివాహేతర సంబంధానికి ఈ బిడ్డ అడ్డుగా ఉందని వనిత, శ్రీనివాస్ తలచారు. కార్తీక్ పనికి వెళ్లిన సమయంలో కన్నబిడ్డ అని చూడకుండా గొంతు నులిమి, కత్తితో గొంతు కోసి హత్య చేసింది. తరువాత బిడ్డ మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి ఇంటి సమీపంలో ఉన్న చెత్తకుప్పలో విసిరేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చింది. తరువాత బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి నాటకం ఆడింది. ఈ స్థితిలోనే వనిత పోలీసుల విచారణలో చిక్కుకుంది. హత్య చేయడానికి శ్రీనివాసన్ అనుచరుడిగా ఉన్నాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ వస్తున్నారు. వనిత చెప్పిన చెత్తకుప్ప వద్దకు వెళ్లి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. తరువాత వనితను పోలీసుస్టేషన్‌కు తీసుకుని వెళ్లి సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
ఏడేళ్ల చిన్నారి హత్య
ఒంగోలు / కందుకూరు: అభం శుభం తెలియని ఓ చిన్నారి అనుమానస్పద మృతి పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. ఒంటిపై దెబ్బలతో కాళ్లు కట్టేసి బావిలో పడేసిన స్థితిలో చిన్నారిని స్థానికులు గుర్తించారు. స్థానికులు. కానీ, అంతలోనే గుట్టుచప్పుడు కాకుండా బంధువులు మృతదేహాన్ని ఖననం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సాయంత్రం వెలుగుచూసిన ఈ సంఘటన కందుకూరు పట్టణంలోని బూడిదపాలెంలో జరిగింది. ఇప్పటికే రంగ ప్రవేశం చేసిన పోలీసులు చిన్నారి మృతి మిష్టరీని చేధించే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బూడిపాలేనికి చెందిన షేక్ బషీర్, బషీరున్ దంపతుల కుమార్తె నేహా(7). తండ్రి బషీర్ ఐదేళ్ల క్రితమే మృతి చెందాడు. దీంతో కుమార్తె తల్లి బషీరున్ వద్దే ఉంటుంది. అయితే ప్రతి రోజు పగలు మొత్తం వీరి ఇంటికి సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి నేహా వెళ్తూ ఉంటుంది. పగలంతా అక్కడే ఉండి తిరిగి రాత్రి పడుకునే సమయానికి తల్లి వద్దకు వస్తుంటుంది. అయితే మంగళవారం నేహా అమ్మమ్మ వద్దకు వెళ్లలేదు. ఎంత సేపు చూసినా మనువరాలు రాకపోవడంతో ఇంటికి దగ్గర ఉందేమోనని తీసుకెళ్లేందుకు మధ్యహ్నం సమయంలో కుమార్తె ఇంటి వద్దకు వచ్చింది. అప్పటికే నేహా బావిలో శవమై తేలింది. దీంతో స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ సయమంలో నేహా కాళ్లు, చేతులు కట్టేసి ఉండడంతో పాటు, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయి. దీంతో చిన్నారి నేహా మృతి మిస్టరీగా మారింది. ఈ సంఘటన బయటకు పొక్కకుండా మృతురాలి బంధువులే జాగ్రత్త పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేహ మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని ఖననం చేశారు. దీంతో స్థానికులు జరిగిన సంఘటనపై పరిష్కార వేదిక సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి మంగళవారం రాత్రి పోలీసులు చేరుకున్నారు. నేడు తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. తల్లిపైనే అనుమానం... చిన్నారి నేహా మృతిపై ఆమె తల్లి బషీరున్పైనే స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేహాతో కలిసి బూడిదపాలెంలోనే ఆమె నివాసం ఉంటుంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా ఉండదని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లి ఏమైనా చేసిందా, లేక వేరొకరి ప్రమేయం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్ల బాలికను కాళ్లు చేతులు కట్టేసి బావిలో వేయాల్సిన అవసరం ఎవరికి ఉందనే విషయాలు పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది. -
ఏడో తరగతే అయినా అబార్షన్లు..
సైదాబాద్: చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ çబ్రూణహత్యలకు పాల్పడుతున్న గాయత్రి నర్సింగ్‌హోం నిర్వాహకులను సైదాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్ప్పెక్టర్ కాట్న సత్తయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్‌సదన్ డివిజన్, సింగరేణి కాలనీలోని గాయత్రి నర్సింగ్‌హోంలో చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, ఆడ పిల్లేనని తేలితే అబార్షన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ అంబర్‌పేటకు చెందిన సందీప్‌యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై గత మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఈ నెల 5న సైదాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సైదాబాద్ పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసి గాయత్రి నర్సింగ్‌హోంలో జరుగుతున్న కార్యకలపాలపై విచారణ జరిపారు. అందులో సూపర్వైజర్గా పని చేస్తున్న సర్వారి ఉన్నిసా ఏడో తరగతే అయినా అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు. నర్సింగ్‌హోం నిర్వాహకులు డాక్టర్ రచనాసింగ్ ఠాకూర్, డాక్టర్ కిరణ్‌కుమార్ పర్యవేక్షణలోనే ఇవి జరుగుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా కోర్టు 15 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు. -
క్షుద్రపూజల కోసమే చిన్నారి తల నరికేశారా?
-
'ఆడ' పుట్టుకే శాపమా
♦ కడుపులోనే తుంచడమో.. కని వదిలేయడమో! ♦ పెంచే స్థోమతలేదని అమ్ముకోవడమో.. ♦ ఏటికేడు తగ్గుతున్న ఆడ శిశువుల సంఖ్య ప్రపంచ చరిత్ర పురుడుపోసుకునేది ఆమె గర్భంలోనే. సమాజానికి మార్గదర్శకులు పెరిగేది ఆమె పొత్తిళ్లలోనే. సాంకేతికతకు పరుగులు నేర్పే శాస్త్రవేత్తలు నడకలు నేర్చేది ఆమె నీడలోనే.. అనితర సాధ్యమైన సవాళ్లకు ఎదురొడ్డి ఆకాశంలో సగమంటూ మగవారికి దీటుగా మహిళలు దూసుకెళుతున్నారు. ఎవరెస్టంత ఎత్తు ఎదిగినా.. అంతరిక్షాన్ని చుట్టివస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్నా.. సమాజంలో ఆమెపై వివక్ష కొనసాగుతూనే ఉంది. కొందరు కడుపులోనే తుంచుతుంటే, మరికొందరు ఆడశిశువు నేలపై పడగానే ముళ్లపొదలు, చెత్తకుప్పల్లో వదిలివెళుతున్నారు. ఇంకొందరు అమ్ముకుంటున్నారు. ఆడపిల్లలపై కొనసాగుతున్న వివక్షపై ఫోకస్.. - కామారెడ్డి ‘‘కటిక దరిద్రం.. ఉండడానికి ఇల్లులేదు. కరువు వల్ల చేయడానికి పని లేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేదు. ఒక ఆధార్ కార్డు తప్ప మా వద్ద ఇంకేం లేదు. మాకు ఇప్పటికే ఇద్దరు అడపిల్లలు.. మరో అడ పిల్ల పుట్టింది. వారిని ఎలా పెంచాలో తెలియలేదు. పసిపాపను తీసుకెళ్లి బోధన్‌లో భిక్షాటన చేశాం. ఇల్లు కూడా గడవడం కష్టమవడంతో నెలన్నర పాపను అమ్ముకోవాలనుకున్నాం’’ ఇది అంతాపూర్ తండాకు చెందిన శాంతాబాయి, మోహన్ దంపతుల ఆవేదన. ఈ శిశువు విక్రయాన్ని ఇటీవల ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. ఇది వెలుగులోకి వచ్చింది.. వెలుగులోకి రాని పసిబిడ్డల అమ్మకాలెన్నో.. - వర్ని జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు.. ♦ వర్ని మండలం అంతాపూర్ తండాలో నెలన్నర వయసున్న పసిపాప విక్రయాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. దేగావత్ శాంతాబాయి, మోహన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నెలన్నర క్రితం మరో కూతురు జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతో ఒక పాపను అమ్మేందుకు ప్రయత్నించారు. ♦ లింగంపేట మండలం కన్నాపూర్ తండాకు చెందిన లక్ష్మీబాయి, విఠల్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారసుడికోసం మరో కాన్పు కోసం వేచిచూశారు. గతేడాది నాలుగో కాన్పులోనూ వారికి ఆడపిల్లే పుట్టింది. నలుగురు ఆడపిల్లలను ఎలా సాకేదంటూ అమ్మకానికి పెట్టగా.. అప్పట్లో అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు నచ్చజె ప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకపోవడంతో పిల్లలను శిశువిహార్‌కు తరలించారు. ♦ లింగంపేట మండలం ఎక్కపల్లి తండాకు చెందిన శమంత, సర్దార్ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మూడో కాన్పులోనూ ఆడ పిల్లే జన్మించింది. శిశువును విక్రయించే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు. పడిపోతున్న నిష్పత్తి ♦ జనాభాలో ఆడ, మగ నిష్పత్తి సమానంగా ఉండాలి. కానీ ఆడపిల్లలపై వివక్ష కారణంగా ఈ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగిపోతోంది. భ్రూణహత్యలు, శిశుహత్యలతో భవిష్యత్తు అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. జిల్లా జనాభాను పరిశీలిస్తే వివక్ష ఎలా ఉందో స్పష్టమవుతోంది. ♦ 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 25,51,335. ఇందులో మహిళలు 13,00,694 మంది కాగా పురుషులు 12,50,641 మంది. ఈ లెక్కల ప్రకారం మహిళల జనాభా ఎక్కువగా ఉంది. కానీ ఆరేళ్లలోపు పిల్లల జనాభాను పరిశీలిస్తే.. బాలికల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ♦ జిల్లాలో పిల్లల సంఖ్య 2,82,417 మంది కాగా.. అందులో మగ పిల్లలు 1,44,977 మంది, ఆడపిల్లలు 1,37,440 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 50 వేలపైచిలుకు మహిళలు ఎక్కువగా ఉంటే, పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆడపిల్లల సంఖ్య 7,500 తక్కువగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదమే.. పుష్కర కాలం తర్వాత మగవారికి పెళ్లి కావడం గగనమే.. వారసత్వం కొడుకుకేనా? సమాజంలో వారసత్వం అంటే కొడుకుకే అన్న భావన ఎక్కువగా ఉంది. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపడం ద్వారా ఆమె తమ వంశం నుంచి మరో వంశంలోకి అడుగుపెడుతుందని, తద్వారా ఆమె తమకు వారసురాలు కాదనే భావన చాలా మందిలో ఉంది. నిరక్షరాస్యులే కాదు చదువుకున్న వారూ ఈ భావనతోనే ఉన్నారు. దానికితోడు పేదరికం, ఆడ, మగ సమానమన్న అవగాహన లేకపోవడం, అవగాహన కల్పించే యంత్రాంగం కూడా లేకపోవడంతో ఆడపిల్లలపై వివక్ష అంతం కావడంలేదు. కొందరు చదువుల విషయంలోనూ వివక్ష చూపుతున్నారు. కుమారులను ప్రైవేట్ పాఠశాలల్లో చేరుస్తున్న తల్లిదండ్రులు.. బిడ్డలను మాత్రం సర్కారు బడికి పంపిస్తున్నారు. ఆడపిల్లల్ని కాపాడుకుందాం కూతురును భారంగా భావించే తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలు లేకుండా మానవాళి ఉనికిలో ఉండగలదా అని ప్రశ్నించుకోవాలి. ఆడపిల్లలపై వివక్షకు ఫలితాలను ఇప్పటికే అనుభవిస్తున్నాం. చాలామంది పెళ్లీడుకొచ్చిన మగవారికి వధువులు దొరకడం లేదు. ఇది ఆడపిల్లలపై వివక్ష ఫలితమేనన్నది కాదనలేని సత్యం. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.. రాబోయే పది, పదిహేనేళ్ల కాలంలో పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఊహించడం కష్టమేం కాదు.. ఆడపిల్లల్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకనబద్ధులు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆడపిల్లల్ని వద్దనుకుంటే రేపటికి మనుగడే లేదన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. ‘గర్భస్థ పిండ లింగ నిర్ధారణ’పై నిషేధం ఉన్నా.. ఆడపిల్లలంటే భారమనే భావనతో లింగనిర్ధారణ పరీక్షలు చేయించి.. పుట్టేది ఆడపిల్లని తెలియగానే చాలా మంది గర్భంలోనే పిండాలను చిదిమేస్తున్నారు. ఫలితంగా బాలికల సంఖ్య ఏడాదికేడాది పడిపోతోంది. భ్రూణహత్యలు పెరుగుతుండడంతో 1994లో కేంద్ర ప్రభుత్వం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గర్భస్థ పిండానికి కొన్ని పద్ధతుల ద్వారా నిర్ధారణకు ఈ చట్టం అవకాశం కల్పించింది. మిగిలిన ఏ సందర్భంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేయకూడదని స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చట్టం ప్రకారం కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం సరిగా అమలు కావడం లేదు. స్కానింగ్ కేంద్రాల వద్ద లింగనిర్ధారణ పరీక్షలు నేరమనే బోర్డులుంటాయి. అయినా.. డబ్బులకోసం కక్కుర్తితో చాలా కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూనే ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం, కక్కుర్తి ఆడజాతికి శాపంగా మారింది. ప్లస్సూ -మైనస్ భావన పోవాలి నిరక్షరాస్యులు, పేదరికంలో మగ్గేవారు అవగాహన లేక ఆడపిల్లలను వద్దనుకుంటుంటే.. చదువుకున్న వారు మాత్రం ఆడపిల్లను మైనస్ అని, మగపిల్లవాడిని ప్లస్ అని భావిస్తూ భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. ఆడపిల్లను చదివించి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేయాలని, మగపిల్లాడైతే చదివిస్తే చాలు ఏ ఖర్చు ఉండదనే భావనతో మరికొందరున్నారు. పిల్లలెందరని ఎవరైనా అడిగితే.. ‘వన్ ప్లస్ వన్ మైనస్’ అనో.. ‘రెండూ ప్లస్లే అనో.. ‘టూ మైనస్’ అనో చెబుతూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగిస్తున్నారు. విద్యాధిక కుటుంబాల్లో ఈ భావన ఎక్కువగా ఉంది. కాలువలు, ముళ్లపొదలపాలు.. ఎన్నో అడ్డంకులను అధిగమించి నేలపై అడుగిడిన ఆడ శిశువులను కొందరు తల్లిదండ్రులు భారంగా భావించి మురికి కాలువలు, ముళ్లపొదల్లో వదిలేస్తున్నారు. పుట్టిన బిడ్డ ఆడపిల్ల అయితే చాలు ఎలాగోలా వదిలించుకోవాలనే భావనతో గుట్టుచప్పుడు కాకుండా వదిలివెళుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని మురికి కాలువలో గతేడాది నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు కనిపించాయి. ఓ చోట కొనప్రాణంతో ఉన్న శిశువును గుర్తించి కాపాడారు. నిజామాబాద్ నగరంలో కవల ఆడ పిల్లలు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆస్పత్రిలోనే వదిలి మాయమయ్యారు. మాచారెడ్డి మండలం పాల్వంచ గ్రామంలోనూ గతేడాది ఓ ఆడశిశువును పాడుబడ్డ బావిలో వదిలివెళ్లారు. శిశువు ఏడుపును విని గ్రామస్తులు కాపాడారు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. -
అస్మా మృతదేహం వెలికితీత - పోస్టుమార్టం
వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంకొప్పర్తికి చెందిన అస్మా(6) అనే చిన్నారి హత్యకు గురైన విషయం తెలిసిందే. అస్మా మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం తహశీల్దార్, రూరల్ సీఐ ఆధ్యర్యంలో వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామానికి చెందిన నాయబ్ రసూల్, మస్తానీ దంపతుల కుమార్తె అస్మా(6) ఈనెల 6వ తేదీ అదృశ్యమైంది. ఎక్కడ వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చిన్నారిని తన భర్తే హత్యచేసి పూడ్చిపెట్టాడని అదే గ్రామానికి చెందిన ఓబులేశు బార్య పోలీసులకు చెప్పడంతో కేసు మలుపు తిరిగింది. ఓబులేసును అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం మధ్యాహ్నం తను పూడ్చిపెట్టిన చోట తవ్వి చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
చెత్తకుప్పలో చిన్నారి
మూడో సంతానంగా ఆడపిల్లేనని..గొంతు నులిమి పడేసిన తండ్రి? సంగారెడ్డి క్రైం/మున్సిపాలిటీ: మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టిందని కన్న తండ్రే పసికందును మట్టుబెట్టపోయాడు. గొంతు నులిమాడు. చనిపోయిందని భావించి చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డిలో బుధవారం చోటు చేసుకుంది. నంగునూరు మండలం వెంకటాపూర్‌కు చెందిన నర్సింలు, స్వప్న భార్యాభర్తలు. మూడేళ్లుగా వీరు సంగారెడ్డిలోని సైనిక్‌నగర్ కాలనీలో నివాసముంటున్నారు. నర్సింలు పటాన్చెరు మండలం రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో పర్మనెంట్ కార్మికుడు. వీరికి సంజన, మానస ఇద్దరు కుమార్తెలు. అయితే నర్సింలు భార్య స్వప్న పట్టణంలోని గోకుల్ ఆస్పత్రిలో డిసెంబర్ 6న మరో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మూడో సంతానంగా మళ్లీ ఆడపిల్లేనా.. అని 17 రోజుల పసిపాపను చంపేందుకు కన్నతండ్రే గొంతు నులిమాడు. పాప చనిపోయిందని భావించి ప్రశాంత్‌నగర్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయ పరిసరాల్లోని చెత్తకుండీలో పడేశాడు. కొద్ది సేపటికి చెత్తకుప్పలోంచి పసిపాప ఏడుపు వినిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న పసిపాపను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ శ్రేయ ఆధ్వర్యంలో వైద్యులు చిన్నారికి చికిత్స నిర్వహించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. చిన్నారిని హత్య చేసేందుకు యత్నించిన తండ్రి నర్సింలును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భర్త అలాంటి వాడు కాదని భార్య స్వప్న చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. -
తల్లే చంపింది!
►మిస్టరీ వీడిన అక్కంపల్లి చిన్నారి హత్య కేసు ►గుప్త నిధుల కోసమే ‘పూజ’ హత్య ►కన్న కూతురినే బలి ఇవ్వడానికి ఒప్పుకొన్న తల్లి ►దొరకబోయే నిధుల పంపకాల్లో తేడాలు రావడంతో బెడిసిన పన్నాగం ►నిందితురాలు తల్లితోపాటు మరో ఇద్దరి ప్రమేయం ►వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ అనుమానమే నిజమైంది. చిన్నారి పూజను తల్లే మరో ఇద్దరితో కలిసి హతమార్చిందని తేలింది. రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లిలో గత నెల 23న గుప్తనిధుల కోసం చిన్నారి పూజను బలిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీని మంగళవారం ఛేదించారు. వివాహేతర సంబంధం, గుప్తనిధుల నేపథ్యంలోనే పూజను హత్యచేసినట్టు గుర్తించా రు. ఇందులో పాల్గొన్న ముగ్గుర్నీ అరెస్టు చేశారు. యాలాల: మానవత్వాన్ని మంటగలిపిందో తల్లి. గుప్త నిధుల కోసం కన్న కూతురినే బలిచ్చింది. దొరకబోయే నిధుల్లో వాటా విషయమై తేడాలు రావడంతో.. బండారం బయటపడుతుందని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి చివరకు అడ్డంగా దొరికిపోయింది.గత నెల 23న మండల పరిధిలోని అక్కంపల్లిలో జరిగినచిన్నారి హత్య కేసు మిస్టరీృ పోలీసులు ఛేదించారు. ఈ ఘటన లో ప్రధాన నిందితురాలితో పాటు మరో ఇద్దరు నిందితులను మంగళవారం రూరల్‌సీఐ శివశంకర్ విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబందించిన రూరల్ సీఐ కథనం ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పల లక్ష్మికి మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన భీములుతో వివాహం జరిగింది. వీరికి పూజ(1) పుట్టిన అనంతరం లక్ష్మిని భీములు వదిలేశాడు. ఇక అప్పటినుంచి అక్కంపల్లిలోనే లక్ష్మి నివసిస్తోంది. ఇటీవల ఆమె అక్క పద్మమ్మ అనారోగ్యంతో మృతిచెందడంతో అదే ఇంటో లక్ష్మి ఉంటోంది. ఇదిలావుండగా మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన మైలారం నర్సిములు అక్కంపల్లికి చెందిన ఘనాపురం భీమమ్మను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకొని ఇల్లరికం వచాృడు. ఈ క్రమంలో నర్సిములు, లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం నెలకొంది. అయితే నర్సిములు ఎప్పుడూ గుప్తనిధులు, మంత్రాలు, తంత్రాలు అంటూ తిరిగేవాడు. కాగా లక్ష్మి నివసిస్తున్న ఇంటి సమీపంలో గుప్త నిధులున్నాయని, వాటిని బయటకు తీద్దామని నర్సిములు ఆమెను ఒప్పించాడు. ఇక దీనికోసం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతానికి చెందిన సోమనాథ్స్వామి సహాయానిృ తీసుకున్నారు. గత నెల 22న లక్ష్మి ఇంటికి వచ్చిన నర్సిములు, సోమనాథ్స్వామిలు రాత్రివేళ ఇంటి సమీపంలో ముగ్గులు వేయాలని చెప్పారు. అంతేకాకుండా గుప్త నిధుల కోసం నరబలి అవసరమని సోమనాథ్ పేర్కొనడంతో ఇంట్లో నిద్రిస్తున్న పూజ(1)ను బలికి సిద్ధం చేశారు. నర్సిములు తన వద్ద ఉన్న మొలతాడుతో పాప గొంతు నలుమి హత్యచేశాడు. పూజను హత్య చేసే సమయంలో లక్ష్మి కూడా వారికి సహకరించింది. దొరకబోయే నిధి పంపకాల్లో తేడాలు రావడంతో.. కాగా పూజను హత్య చేసిన అనంతరం ముగ్గురు నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో ఇంటి సమీపంలో పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో వెలికితీయబోయే నిధుల్లో వాటాల గురించి ముగ్గురు వాదోపవాదాలు చేసుకున్నారు. దీంతో ముగ్గురి మద్య బేధాభిప్రాయాలు వచ్చాయి. ఎలాగైన విషయం బయటకు పొక్కుతుందనే భావంతో నర్సిములు, సోమనాథ్‌లు అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో గ్రామానికి చెందిన కొందరూ అటువైపు బహిర్భూమికి రావడంతో లక్ష్మి కూడ ఇంట్లోకి వచ్చింది. తాను చేసిన తప్పును ఎలా కప్పి పుచ్చుకోవాలనే ఆలోచనతో మరుసటి రోజు కొత్త ‘కథ’ను పోలీసులు, గ్రామస్తులకు తెలియజేసింది. ఘటన అనంతరం పొంతనలేని లక్ష్మి మాటలతో అనుమానించిన పోలీసులు నర్సిములు, సోమనాథ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అక్కంపల్లి గ్రామంలో మూఢనమ్మకాలపై కళజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యాలాల ఎస్ఐ విజయభాస్కర్ ఉన్నారు. -
చిన్నారిని చిదిమేశారు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి అనంతరం నీళ్ల ట్యాంకులో పడేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్లూరు మండలం ఎర్రబోయిన పల్లికి చెందిన నాగేశ్వరరావు మణుగూరులోని సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన కొడుకు సుమన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంబీఏ చేస్తున్నారు. కాగా, సుమన్ అయిదేళ్ల క్రితం ఆగ్రాకు చెందిన నిధిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. సుమన్ హైదరాబాద్‌లోనే ఉండి చదువుకుంటుండగా నిధి మాత్రం అత్తమామలతో కలిసి కల్లూరులో నివసిస్తుంది. అయితే గురువారం అర్థరాత్రి తరువాత తన మంచంపై ఉన్న చిన్న కుమార్తె కనిపించకపోవడంతో గమనించిన నిధి... తన అత్తమామలకు ఆ విషయం తెలిపింది. దీంతో అందరూ కలసి రాత్రంతా చిన్నారి కోసం వెతికారు. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం డాబాపైన ఉన్న నీళ్ల ట్యాంకులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా నాగేశ్వరరావు దంపతులను పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించిన చిన్నారి తల్లి మాత్రం ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. భర్త హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాతే అన్ని విషయాలు చెబుతానంటోంది. కాగా, అత్తమామలు, కోడలికి మధ్య సఖ్యత లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
చిన్నారి హత్య: మహిళ అరెస్ట్
వేలూరు: వివాహేతర సంబంధం ప్రియుడి భార్యకు తెలిసిపోవడంతో కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకుని ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం ప్రాంతానికి చెందిన మురళి. ఇతనికి ముగ్గురు పిల్లలున్నారు. రెండవ కుమారుడు దినేష్(3) శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆటలాడుతూ కనిపించకపోవడంతో వేలూరు నార్త్ పోలీసులకు మురళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముత్తుమండపం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులను చూసిన వెంటనే మురళి ఇంటి ముందు నివశిస్తున్న పెయింటర్ ప్రభు భార్య సుమతి ఇంటికి తాళం వేసి బయట వచ్చి కూర్చుంది. అనుమానించిన పోలీసులు సుమతి వద్ద విచారణ జరపగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలో గాలించారు. బీరువాను పగలగొట్టి చూడగా అందులో చిన్నారి నోటిలో గుడ్డలు పెట్టి కాళ్లు,చేతులు కట్టి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు సుమతిని అరెస్ట్ చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసుల విచారణలో చిన్నారి తండ్రి మురళీకి, తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. ఈ విషయం మురళి భార్యకు తెలిసి పోవడంతో ఆమె తనతో ఇటీవల ఘర్షణ పడిందని పోలీసులకు చెప్పింది. ఆమె మీద కక్ష తీర్చుకోవడం కోసం వీధిలో ఆటలాడుకుంటున్న దినేష్‌ను ఇంటిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు, చేతులు కట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశానని, ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని బీరువాలో పెట్టినట్లు నేరాన్ని అంగీకరించింది. కేసు దర్యాప్తులో ఉంది.