ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగం వచ్చింది.
ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్‌లోని ఉపర్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్‌కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు?
Comments
Please login to add a commentAdd a comment