ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ తర్వాత మరో నగరమైన అలీగఢ్ పేరు మారింది. తాజాగా అలీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ అలీగఢ్ పేరును హరిగఢ్‌గా మార్చే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యూపీలోని నగరాల పేర్లను మార్చడం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే దీనిలో అలీగఢ్ పేరు మార్పు వెనుక ఒక ప్రత్యకత, ఘనమైన చరిత్ర ఉంది.
అలీగఢ్‌ను పూర్వకాలంలో అంటే 200 ఏళ్ల క్రితం కోయిల్ లేదా కోల్ అని పిలిచేవారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఈ ప్రాంతాన్ని పాలించిన కౌశిరివ్ పేరు కనిపిస్తుంది. అతనిని యుద్ధంలో ఓడించిన కోల్ అనే రాక్షస రాజు ఈ ప్రదేశానికి పాలకునిగా మారతాడు. అతని పేరును అనుసరించి ఈ ప్రదేశానికి కోల్ అని పేరు పెట్టారు. కాగా సయ్యద్ రాజవంశం కాలంలో కోల్ ప్రాంతం పేరు అలీగఢ్‌గా మారింది.
అలీగఢ్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నగరం. దీనిని లాక్ సిటీ అని కూడా అంటారు. మొఘలుల కాలం నుండి తాళాల తయారీకి ప్రాంతం ప్రసిద్ది చెందింది. ఈ నగరంలో సెంట్రల్ యూనివర్శిటీ ఉంది. ఇక్కడ వందలాది మంది విద్యార్థులు తమ చదువులను పూర్తి చేస్తున్నారు. భారతీయత ఉట్టిపడాలనే ఉద్దేశంతోనే అలీగఢ్‌ను హరిగఢ్‌గా మార్చారు.
ఇది కూడా చదవండి: దుబాయ్‌లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది?
Comments
Please login to add a commentAdd a comment