మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ మసీదు ప్రాంతంలో ఒక దేవాలయం ఉండేదని, దానిని కూల్చివేసి మసీదు నిర్మించారనే వాదన వినిపిస్తోంది.
సీనియర్ చరిత్రకారుడు డా. అజయ్ అనుపమ్‌తో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని హరిహర దేవాలయం గురించి పలు మత గ్రంథాలలో ప్రస్తావన ఉంది. సంభాల్ పౌరాణిక చరిత కలిగిన ప్రదేశమని అన్నారు. పురాణాల్లో పేర్కొన్న విషయాలను మనం కాదనలేమని, మత్స్య పురాణం, శ్రీమద్ భగవతం, స్కంద పురాణాలలో సంభాల్ ప్రస్తావన ఉందన్నారు.
పురాణాలలోని వివరాల ప్రకారం రాజు నహుష కుమారుడు యయాతి ఈ సంభల్ నగరాన్ని స్థాపించాడు. అలాగే ఇక్కడ హరిహర ఆలయాన్ని నిర్మించాడు. హరి అంటే విష్ణువు. హరుడు అంటే శంకరుడు. యయాతి తన పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోందన్నారు.
ఇది కూడా చదవండి: అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి
Comments
Please login to add a commentAdd a comment