masque
-
Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’
మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ మసీదు ప్రాంతంలో ఒక దేవాలయం ఉండేదని, దానిని కూల్చివేసి మసీదు నిర్మించారనే వాదన వినిపిస్తోంది.సీనియర్ చరిత్రకారుడు డా. అజయ్ అనుపమ్‌తో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని హరిహర దేవాలయం గురించి పలు మత గ్రంథాలలో ప్రస్తావన ఉంది. సంభాల్ పౌరాణిక చరిత కలిగిన ప్రదేశమని అన్నారు. పురాణాల్లో పేర్కొన్న విషయాలను మనం కాదనలేమని, మత్స్య పురాణం, శ్రీమద్ భగవతం, స్కంద పురాణాలలో సంభాల్ ప్రస్తావన ఉందన్నారు.పురాణాలలోని వివరాల ప్రకారం రాజు నహుష కుమారుడు యయాతి ఈ సంభల్ నగరాన్ని స్థాపించాడు. అలాగే ఇక్కడ హరిహర ఆలయాన్ని నిర్మించాడు. హరి అంటే విష్ణువు. హరుడు అంటే శంకరుడు. యయాతి తన పూజల కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోందన్నారు.ఇది కూడా చదవండి: అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి -
సంచలన వ్యాఖ్యలు : మసీదులో హోమం చేస్తాం!
లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచి లక్నోలోని ఒక మసీదులో హోమం చేస్తామని శుక్రవారం నాడు సంచలన వాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ మధురాలోని ఒక ఆలయంలో నమాజ్ సమర్పించినందుకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన కొన్ని రోజుల తరువాత ఆమె ఇలా బహిరంగంగా ప్రకటించడం తీవ్ర కలకలం రేపింది. అయితే వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అక్టోబర్ 29 న మధురలోని నందగావ్‌లో ఉన్న నంద్ బాబా మందిర్ వద్ద ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేశారనే ఆరోపణలతో పోలీసులు నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజల్ ఖాన్, చంద్ మొహమ్మద్ అనే వ్యక్తులు నమాజ్ చేయగా వారితో పాటు వచ్చిన అలోక్ రతన్, నీలేష్ గుప్తా వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తరువాత, మసీదులలో 'హనుమాన్ చలీసా' చదివిన కేసులు వెలువడ్డాయి. తారోలి గ్రామంలోని ఒక మసీదులోకి ప్రవేశించి హనుమాన్ చలీసాను పఠించినట్లు ఆరోపణలు రావడంతో మధుర పోలీసులు గురువారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపై సీఆర్పీసీ 151 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రాచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక ప్రాచి ఈ విషయాల పై స్పందిస్తూ సామాజిక సామరస్యం పేరిట ఒక ముఠా దేవాలయాలకు వెళ్లి నమాజ్ చేస్తోందని, సాంఘిక సామరస్యాన్ని కాపాడుకునేలా హిందువులు కూడా మసీదుల వద్దకు వెళ్లి హోమం చేయాలని తాము అభిప్రాయపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. దేవాలయాలను నాశనం చేసి నిర్మించిన మసీదులను కూల్చివేసి అక్కడ పూజలు నిర్వహించాలన్నారు. హోమం చేయడం ద్వారా వాయు కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. లక్నోలో ఉన్న పురాతన మసీదలో హోమం చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే తరువాత ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. దీంతో పాటు ఆమె ‘లవ్ జిహాద్’ పై కూడా స్పందించారు. ఇది ఎంతోకాలంగా చేస్తోన్న కుట్ర అని ఇది నెమ్మదిగా భారతదేశమంతా విస్తరిస్తుందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను బహిరంగా ఉరితీయాలన్నారు. ఈ విషయానికి సంబంధించి కఠినమైన చట్టాన్ని తీసుకురావాలన్నారు. చదవండి: లవ్ జిహాద్: విచారణలో కీలక విషయాలు -
కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
-
ఏపీలో కుట్రలకు పాల్పడితే కఠిన చర్యలు: డీజీపీ
సాక్షి, విజయవాడ: మత సామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కుట్రపూరిత చర్యలకు పాలడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతాచర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలను అప్రమత్తం చేశామని తెలిపారు గౌతం సవాంగ్. (చదవండి: తప్పుడు ఆరోపణలు ఉపేక్షించం) రాజకీయ లబ్ధి కోసమే గుడివాడ ఘటన: రవీంద్రనాథ్ బాబు నిరాదరణ ఆరోపణలతో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు హెచ్చరించారు. గుడివాడలో జరిగిన సంఘటన రాజకీయ లబ్ధి కోసమే జరిగింది అన్నారు. నిరాదరణ ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాగుడుకి బానిసలైన ఇద్దరు వ్యక్తులు మద్యం కొనడానికి అవసరమైన డబ్బుల కోసం హుండీని బద్దలు కొట్టారని విచారణలో వెల్లడించారన్నారు. హుండీలో 600 రూపాయలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలిపారు. జిల్లాలో ఉన్న మతాలకు సంబంధించిన అన్ని ప్రార్థనామందిరాల దగ్గర తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చాలని సూచించామన్నారు. ప్రశాంతంగా ఉన్న మతాల మధ్య వివాదాలు రాజేసి వ్యక్తిగత, రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటే చర్యలు తప్పవని రవీంద్రనాథ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. -
మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి
కాబూల్: మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్గనిస్తాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. గార్డెజ్ పట్టణంలో గల మసీదులో ప్రజలు ప్రార్ధన చేస్తున్న సమయంలో దాడి జరిగిందని ఆఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యత తమదే అని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ వెల్లడించలేదని జినువా వార్తాసంస్థ తెలిపింది. రంజాన్ మాసం సదర్భంగా నిర్వహించే ‘తరవి’ ప్రార్థనల్లో ఈ కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.