మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి | Three killed in Afghan mosque shooting | Sakshi
Sakshi News home page

మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి

Published Sat, Jun 10 2017 12:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి

మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి

కాబూల్‌: మసీదులో ప్రార్థనలు చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆఫ్గనిస్తాన్‌లోని పక్తియా ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

గార్డెజ్‌ పట్టణంలో గల మసీదులో ప్రజలు ప్రార్ధన చేస్తున్న సమయంలో దాడి జరిగిందని ఆఫ్గనిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనకు బాధ్యత తమదే అని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ వెల్లడించలేదని జినువా వార్తాసంస్థ తెలిపింది. రంజాన్‌ మాసం సదర్భంగా నిర్వహించే  ‘తరవి’  ప్రార్థనల్లో ఈ కాల్పులు చోటు చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement