
అలీగఢ్(యూపీ): ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి యువతులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలకు సెల్‌ఫోన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇంట్లోని ఆడపిల్లలు పరాయి యువకులతో కలిసి లేచిపోవద్దని అనుకుంటే సెల్‌ఫోన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వయసొచ్చిన కుమార్తెలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని తల్లులకు హితబోధ చేశారు.
ఆడపిల్లలకు సెల్‌ఫోన్లు ఇవ్వొద్దన్నారు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జాగ్రత్త పడాలన్నారు. యువతులు ఫోన్లలో యువకులతో మాట్లాడుతున్నారని, తర్వాత ఇద్దరూ కలిసి లేచిపోతున్నారని మీనాకుమారి తప్పుపట్టారు. సమాజంలో నేరాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఆడపిల్లలను కాపాడుకోవడంలో తల్లిదే ప్రధాన పాత్ర అని చెప్పారు. తల్లుల నిర్లక్ష్యం వల్లే బిడ్డలు లేచిపోవడం వంటి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా...