దారుణం: చిన్నారిపై 12 కుక్కలు ఒక్కసారిగా.. | Uttar Pradesh: 12 Dogs Attacked 7 Year Old Girl Cctv | Sakshi
Sakshi News home page

దారుణం: చిన్నారిపై 12 కుక్కలు ఒక్కసారిగా..

Published Wed, Apr 21 2021 1:58 PM | Last Updated on Wed, Apr 21 2021 3:10 PM

Uttar Pradesh: 12 Dogs Attacked 7 Year Old Girl  Cctv - Sakshi

లక్నో:‌ 7 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌ లోని అలీగఢ్‌లో జరిగింది. రోడ్డు మీద ఓ బాలిక తన దారిన తాను దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆ దారిలోని కుక్కలు ఆమె మీదకు ఉరికాయి. దీంతో ఆ బాలిక భయపడి వాటి నుంచి  తప్పించుకోవడానికి పరుగెత్తింది. 

ఈ క్రమంలో ఆ పరిసరాల్లోని 12 కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడిగా బాలిక మీదకు ఉరికాయి. దీంతో చేసేదేమిలేక బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపుల విని సమీంలోని ప్రజలు ఆమెను రక్షించడానికి పరుగెత్తారు. అక్కడ ఉన్న కుక్కలను తరిమేసి బాలికను రక్షించారు. అయితే ఈ ఘటనలో  బాలిక తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

( చదవండి: వైరల్‌ వీడియో: అయ్యయ్యో.. తెలిసిపోయిందా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement