సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా షెల్టర్ హోమ్స్, మదర్సాలు, ఠాణాలు, జువైనల్ హోమ్‌లాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లు ఇతర ముఖ్య కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment