కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు.. | a Man Dragged After Being Hit By Car In Gurgaon in march | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు..

Published Fri, Apr 1 2016 11:51 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM

కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు.. - Sakshi

కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు..

గుర్గావ్: గతనెల 28న గుర్గావ్ లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. హోండా కారు నడుపుతున్న ఓ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అయితే, అయిందేదో అయిపోయిందని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సమస్య అక్కడితో వీగిపోయేది. కారు ఢీకొన్న వెంటనే ఆ వ్యక్తి కారు ముందుభాగంపై పడ్డాడు. మార్కెట్లో చుట్టుపక్కలున్న జనాలు కొడతారని భయపడ్డాడు. ఇక అంతే అక్కడి నుంచి కారును వేగంగా పొనిస్తూ సుమారు కిలోమీటర్ వరకు అలాగే కారు డ్రైవర్ ఈడ్చుకుంటూ వెళ్లాడు

బాధితుని కథనం ప్రకారం... ప్రతీక్ కుమార్, తన మూడేళ్ల బాబుతో కలిసి మార్చి28 సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బంధువుల ఇంటికి వెళుతున్నాడు. ఇంతలో ఓ బ్లాక్ హోండా కారు నడుపుతున్న వ్యక్తి తనను ఢీకొట్టాడనని కనీసం అక్కడ ఆగకుండా అలాగే వెళ్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. పాత ఢిల్లీ రోడ్ మార్గంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పాడు. కిలోమీటర్ వరకు వెళ్లిన తర్వాత కారు నుంచి కింద పడ్డాడనీ ఆ వెంటనే మరో వాహనం తనను తాకడంతో గాయపడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తనకు యాక్సిడెంట్ జరిగిన ఘటనను వీడియో రూపంలో సాక్ష్యాన్ని అందించడానికి ఆ ఏరియాలోని దుకాణాలలో ఎంక్వయిరీ చేసి ఫలితాన్ని పొందాడు. బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement