Hit By Car
-
రక్తమోడిన రహదారులు
పెద్దపంజాణి: చిత్తూరు జిల్లా బసవరాజు కండ్రిగ సమీపంలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలు కాగా, మరో 21 మంది గాయపడ్డారు. శనివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపంజాణి పోలీసుల కథనం ప్రకారం.. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు పరిసర గ్రామాలకు చెందిన 45 మంది తమిళనాడు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు. అనంతపురానికి చెందిన ఖాన్ ట్రావెల్స్ బస్సు మాట్లాడుకుని, ఐదుగురు టూర్ నిర్వాహకులతో శుక్రవారం రాత్రి బయలుదేరారు.అతివేగమే ప్రమాదానికి కారణంబస్సు శనివారం వేకువజామున పెద్దపంజాణి మండల పరిధి పలమనేరు–పుంగనూరు మార్గంలో బసవరాజు కండ్రిగ సమీపానికి చేరుకుంది. బస్సును డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సత్యసాయి జిల్లా రొద్దం మండలం చిన్నగువ్వలపల్లికి చెందిన తిమ్మారెడ్డి భార్య రామానుజమ్మ (58), కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మురారాయనపలి్లకి చెందిన నరసింహారెడ్డి (68) అక్కడిక్కడే మృతి చెందారు. బస్సులోని 21 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దపంజాణి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.అన్నమయ్య జిల్లాలో ఘోరంరామాపురం: కర్నూలు–చిత్తూరు 40వ జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామాపురం మండలం చిట్లూరు పంచాయతీ దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుఝామున ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కడప నాగరాజుపేటకు చెందిన హోంగార్డు పూజారి ఆంజనేయులునాయక్ (28), కడప రాజారెడ్డివీధికి చెందిన కారు డ్రైవర్ పఠాన్ అఫ్రోజ్‌ఖాన్ (35), కడప నాగరాజుపేటకు చెందిన మారాబత్తుల జితేంద్రకుమార్ (24), కడప ఐటీఐ సర్కిల్‌కు చెందిన షేక్ హలీమ్ (35) ఉన్నారు.కడప రవీంద్రనగర్‌కు చెందిన షేక్ ఖాదర్బాషాకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణానికి చెందిన ఈ ఐదుగురూ శుక్రవారం అర్ధరాత్రి కారులో కడప నుంచి బయలుదేరి రాయచోటి వైపు కారులో వెళ్తుండగా, రామాపురం మండలం చిట్లూరు దళితవాడ సమీపంలోని వంతెన వద్ద ఆ కారు ముందు వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక వైపు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలిస్తుండగా జితేందర్‌కుమార్ మార్గంమధ్యలో మృతి చెందాడు. లక్కిరెడ్డిపల్లె సీఐ గంగనాధబాబు, రామాపురం ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్‌రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అదే దారుణం: బైక్‌ను ఢీకొట్టి లాక్కెళ్లిన కారు.. డెలివరీ ఏజెంట్ మృతి
లఖ్‌నవూ: సంచలనం సృష్టించిన ఢిల్లీ ఘటన తరహాలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ జరిగిన ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి అతి సమీపంలోని నోయిడాలో నూతన ఏడాది వేడుకల వేళ ఓ డెలివరీ ఏజెంట్‌ను ఓ కారు ఢీకొట్టి 500 మీటర్లు లాక్కెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దీంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్న కౌషల్‌గా గుర్తించారు. నూతన ఏడాది రాత్రి డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు కౌషల్. నోయిడా సెక్టార్ 14లోని ఫ్లైఓవర్ సమీపంలో అతడి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల మేర లాక్కెళ్లింది. కౌషల్ మృతదేహాన్ని గమనించిన కారు డ్రైవర్ సమీపంలోని ఆలయం వద్ద కారును నిలిపేసి అక్కడి నుంచి పారిపోయాడు. కౌషల్ సోదరుడు అమిత్ బాధితుడికి ఆదివారం రాత్రి 1 గంటకు ఫోన్ చేశాడు. ఆ ఫోన్‌ను సంఘటనా స్థలంలో ఉన్న ఓ వ్యక్తి మాట్లాడి జరిగిన విషయాన్ని చెప్పాడు. అమిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టామని తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్.. స్కూటీపై వెళ్తున్న టీచర్‌ను ఢీకొట్టి 3 కి.మీ ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. -
విషాదంగా ముగిసిన ఓ భర్త ప్రయోగం
-
నిజంగా ప్రేమిస్తే నిరూపించుకో.. తిక్క కుదిరిందా!
బీజింగ్ : ఓ తెలుగు సినిమాలో భర్త.. భార్యకు తన మీద గల ప్రేమను నిరూపించుకోవాలంటూ రకరకాల టెస్టులు పెడుతూ.. ఇబ్బందులకు గురి చేసే సన్నివేశాలు గుర్తుండే ఉంటాయి. సినిమాలో ఈ టెస్ట్ నవ్వు తెప్పిస్తే రియల్ లైఫ్‌లో మాత్రం అది కాస్తా ఫెయిల్ అయ్యి విషాదంగా ముగిసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వివరాలు.. చైనాకు చెందిన ఓ వ్యక్తికి తన భార్యకు తన మీద ప్రేమ ఉందా లేదా అనే అనుమానం వచ్చింది. దాంతో వెంటనే ఓ పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనిలో భాగంగా సదరు వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో నిల్చుంటాడు. భార్య అతనికి ప్రమాదం జరక్కుండా చూడాలి. ఇక టెస్ట్ ప్రారంభించాక భర్త వెళ్లి రోడ్డు మీద నిల్చోవడం.. పాపం భార్య వెళ్లి అతన్ని వెనక్కి తీసుకురావడం.. ఇలా దాదాపు 40 నిమిషాల పాటు సాగిందీ తంతు. ఓ కారు వచ్చి సదరు వ్యక్తిని ఢీ కొట్టేవరకూ ఈ టెస్ట్ ఇలా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి బాధితుడు మాట్లాడుతూ.. ‘సాయంత్రం నా భార్యకు, నాకు గొడవయ్యింది. కోపం వచ్చి బయటకు వెళ్లి మద్యం తాగాను. తిరిగి ఇంటికి వచ్చాక మళ్లీ గొడవ ప్రారంభమయ్యింది. దాంతో అసలు నా భార్య నన్ను ప్రేమిస్తుందా లేదా అనే అనుమానం వచ్చింది. ఈ విషయం తెలుసుకునేందుకు పరీక్ష పెట్టాను. నేను వెళ్లి రద్దీ రోడ్డు మీద నిల్చుంటాను. నా భార్యకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే.. నన్ను వెనక్కి తీసుకొస్తుంది అని భావించాను. అందుకే వెళ్లి రోడ్డు మధ్యలో నిల్చున్న. కానీ దురదృష్టవశాత్తు కారు నన్ను ఢీకొట్టింది’ అంటూ వాపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తిక్క కుదిరిందా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లాడు..
గుర్గావ్: గతనెల 28న గుర్గావ్ లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. హోండా కారు నడుపుతున్న ఓ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అయితే, అయిందేదో అయిపోయిందని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సమస్య అక్కడితో వీగిపోయేది. కారు ఢీకొన్న వెంటనే ఆ వ్యక్తి కారు ముందుభాగంపై పడ్డాడు. మార్కెట్లో చుట్టుపక్కలున్న జనాలు కొడతారని భయపడ్డాడు. ఇక అంతే అక్కడి నుంచి కారును వేగంగా పొనిస్తూ సుమారు కిలోమీటర్ వరకు అలాగే కారు డ్రైవర్ ఈడ్చుకుంటూ వెళ్లాడు బాధితుని కథనం ప్రకారం... ప్రతీక్ కుమార్, తన మూడేళ్ల బాబుతో కలిసి మార్చి28 సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో బంధువుల ఇంటికి వెళుతున్నాడు. ఇంతలో ఓ బ్లాక్ హోండా కారు నడుపుతున్న వ్యక్తి తనను ఢీకొట్టాడనని కనీసం అక్కడ ఆగకుండా అలాగే వెళ్తూనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. పాత ఢిల్లీ రోడ్ మార్గంలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పాడు. కిలోమీటర్ వరకు వెళ్లిన తర్వాత కారు నుంచి కింద పడ్డాడనీ ఆ వెంటనే మరో వాహనం తనను తాకడంతో గాయపడ్డట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. తనకు యాక్సిడెంట్ జరిగిన ఘటనను వీడియో రూపంలో సాక్ష్యాన్ని అందించడానికి ఆ ఏరియాలోని దుకాణాలలో ఎంక్వయిరీ చేసి ఫలితాన్ని పొందాడు. బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.