అన్ని జైళ్లలో సీసీ కెమెరాలు: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కారాగారాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిత్రహింసలను నిరోధించడానికి పోలీసుస్టేషన్లలో, లాకప్‌లలో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు పరిశీలించాలని సూచించింది. అన్ని జైళ్లలో ఏడాదిలోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంది. అలాగే ప్రతి పోలీసుస్టేషన్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండేలా చూడాలని, రాష్ట్రాల మానవ హక్కుల కమిషన్‌లలో ఖాళీలను మూడునెలల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది.