సాక్షి, హైదరాబాద్: వైద్య సిబ్బందిపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు వెళ్లేలా, రోగు లకు వైద్యం చేసేలా పర్యవేక్షణ చేయాలని భావిస్తోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (యూపీ హెచ్‌సీ) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. తద్వారా హైదరాబాద్ నుంచే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించ డానికి మార్గం ఏర్పడనుంది. వైద్య సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి వస్తు న్నారా లేదా అని పర్యవేక్షించి, అవసరమైతే అప్ర మత్తం చేయడానికి వీలు కలగనుంది.
ఇవే కీలకం..
రాష్ట్రంలో వెయ్యి పీహెచ్‌సీలు, యూపీ హెచ్‌సీలున్నాయి. ప్రజలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడానికి, ఇతర సాధారణ వైద్యం అందజేయడానికి ఇవి ఎంతో కీలకం. దాదాపు ప్రతీ మండలానికో పీహెచ్‌సీ ఉంటుంది. పెద్ద మండలాలైతే 2 పీహెచ్‌సీలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పీహెచ్‌సీల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. సీజనల్ వ్యాధుల కాలంలో పీహెచ్‌సీలు కీలకపాత్ర పోషిస్తాయి. అంటువ్యాధులు తీవ్రమైన సందర్భంలో తక్షణ మే స్పందించేలా పీహెచ్‌సీలు వ్యవహరిస్తాయి. ఒక్కో పీహెచ్‌సీల్లో ఒకరు లేదా ఇద్దరు డాక్టర్లుం టారు. నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు.
వైద్యుల గైర్హాజరు..
పీహెచ్‌సీల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు స్థానికం గా ఉండటం లేదన్న విమర్శలున్నాయి. సమీప పట్టణాల్లో నివాసముంటూ పీహెచ్‌సీలకు వస్తూ పోతూ ఉంటారు. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చేవారు ఎక్కువగా ఉంటా రని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొందరు డాక్ట ర్లయితే దాదాపు రోజుకు వంద కిలోమీటర్లకు పైగా వెళ్లే వారుంటున్నారు. హైదరాబాద్‌లో ఉం టూ నిజామాబాద్ జిల్లాలోని పీహెచ్‌సీలకు వెళ్లే వైద్యులూ ఉన్నారని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల సమాచారం. వీరు పట్టణాల్లో ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తుండటంతో పీహెచ్‌సీలకు రావడంలేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ వచ్చినా ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకే వెళ్లిపో తున్నారన్న ఫిర్యాదులు గ్రామాల నుంచి ప్రభు త్వానికి అందాయి. అందుకే వారి కదలికలపైనా ఎప్పటికప్పుడు నిఘా పెట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు..
ఇక హైదరాబాద్ కోఠిలోని ప్రజారోగ్య కార్యాల యంలో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే అన్ని పీహెచ్‌సీలకు అను సంధానం చేశారు. కంట్రోల్ రూంలో భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి అన్ని పీహెచ్ సీల వైద్యులతో నేరుగా మాట్లాడి అవసరమైన ఆదేశాలివ్వొచ్చు. ఎక్కడైనా అంటు వ్యాధుల వం టివి తీవ్రంగా విజృంభిస్తే ఇక్కడి నుంచే వైద్యు లకు సూచనలిస్తారు. ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం లతోనూ మాట్లాడే వీలు కల్పించారు. అవసర మైతే జూమ్ మీటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిస్థాయి కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పా టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రజారోగ్య కార్యాలయాన్ని అన్ని రకాల హైటెక్ హంగులతో సిద్ధం చేశారు. నిత్యం వచ్చే విజిట ర్లను డైరెక్టర్ నేరుగా కలవకుండానే బయట నుంచే వీడియోకాల్ ద్వారా మాట్లాడే సదుపా యం ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో కార్యా లయం లోపలికి వచ్చి జనం గుమిగూడకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజారోగ్య కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద లాకింగ్ సిస్ట మ్‌ను ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఆదేశాల మేరకే ఎవరినైనా పంపడానికి వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment