వైద్యులకు వేతనాల్లేవ్ ! | There are wages to doctors | Sakshi
Sakshi News home page

వైద్యులకు వేతనాల్లేవ్ !

Published Wed, Apr 6 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

There are wages to doctors

కాంట్రాక్టు వైద్యులకు 9 నెలలుగా అందని వేతనాలు
చెప్పుకోలేక ప్రత్యామ్నాయం  చూసుకుంటున్న డాక్టర్లు
పట్టించుకోని ప్రభుత్వం

 

తిరుపతి: జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందలేదు. 2014లో జిల్లాలోని 40 పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం రెండు విడతలుగా కాంట్రాక్టు పద్ధతిలో 40 వుందిని నియుమించింది. 2014 డిసెంబర్‌లో మొదటి విడతలో 32 వుంది వైద్యాధికారులను నియమించింది. 8 వుందికి 2015 జూన్‌లో పీహెచ్‌సీ వైద్యులకు జీతాలు కరువు రెండో విడతలో పోస్టింగ్ ఇచ్చింది. డాక్టర్లకు ప్రతి నెలా జీతం ఇవ్వనున్నట్లు  నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రజలకు సేవచేసే అవకాశం దక్కిందనే ఆశలో వైద్యులు ప్రభుత్వ వైద్యాధికారులుగా విధుల్లో చేరారు. మొదటి విడతలో చేరిన 32 వుందికి డిసెంబర్ 2014 నుండి మే 2015 వరకు ఆరు నెలల జీతం జనవరి 2016లో విడుదల చేశారు. మే 2015 కు సంబంధించిన ఒకనెల జీతం ఫిబ్రవరి 2016లో ప్రభుత్వం డాక్టర్ల ఖాతాల్లో జవుచేసింది. ఆ తరువాత గత తొమ్మిది నెలలకు సంబంధించి కాట్రాక్టు వైద్యాధికారులకు జీతాలు విడుదల చేయులేదు. ఇక 2015 జూలైలో రెండో విడతలో నియుమించిన 8 వుంది వైద్యాధికారులకు ఇప్పటివరకు కనీసం ఒక్క రూపారుు కూడా అందలేదు. ఈ సవుస్యతో మొదటి విడతలో చేరిన 32 వుందిలో 14 వుంది వైద్యులు తవు దారి చూసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిలో కేవలం 18 వుంది వూత్రమే మిగిలారు. అలాగే రెండో విడతలో చేరిన 8 వుందిలో ప్రస్తుతం ఏడుగురు వూత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.



ప్రజాసేవకు వస్తే అవవూనిస్తారా?
లక్షల రూపాయలు ఖర్చుచేసి చదువుకుని గ్రామీణ ప్రజలకు సేవ చేయూలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యాధికారులుగా విధుల్లో చేరితే తవుకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అవవూనిస్తున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రభుత్వం తవును పొవ్మునలేక పొగపెట్టేలా ఉందని వారు వాపోతున్నారు. ఇప్పటికే 40 వుందిలో 15 వుంది వెళ్లిపోయూరని, పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే వురికొంతవుంది వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకారుులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నియామక ఉత్తర్వుల్లో ఇచ్చిన మేరకు ప్రతినెలా జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు వైద్యులు కోరుతున్నారు.

 
త్వరలో సమస్య పరిష్కారం

కాంట్రాక్టు వైద్యుల జీతాల సమస్యను పబ్లిక్ హెల్త్ డెరైక్టర్ డాక్టర్ అరుణకుమారి దృష్టికి తీసుకెళ్లాను. ఆమె ఆదేశాల మేరకు  ప్రతిపాదనలు పంపాను. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.  డాక్టర్లకు జీతాలు అందుతాయి. - డాక్టర్ కోటీశ్వరి, జిల్లా వైద్యశాఖ అధికారి, చిత్తూరు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement