పెట్రోల్‌ బంక్‌లో దారుణం | Viral Video, Robbery Petrol bunk in Chennai | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంక్‌లో దారుణం

Published Thu, Dec 27 2018 10:10 AM | Last Updated on Thu, Mar 21 2024 11:34 AM

తమిళనాడులో ఘోరం జరిగింది. బైక్‌ మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు పెట్రోల్‌ బంక్‌లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తిని దారుణంగా నరికి.. డబ్బు సంచిని లాక్కెళ్లారు. కడలూరు-చిదంబరం రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన బంక్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.  బైక్‌ మీద పెట్రోల్‌ బంక్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. పెట్రోల్‌ పోసే బాయ్‌తో మాట్లాడినట్టు నటించారు.
ఇంతలో చివర కూర్చున్నవాడు.. అతని వద్ద నుంచి డబ్బు సంచి లాక్కునే ప్రయత్నం చేశాడు. దీనిని అతను అడ్డుకోవడంతో కత్తి తీసుకొని దౌర్జన్యానికి దిగాడు. దీంతో అతనితోపాటు ఉన్న మరో సిబ్బంది అక్కడి నుంచి పారిపోయాడు. కత్తి తీసుకొని బెదిరించినా.. డబ్బు ఇచ్చేందుకు బాధితుడు నిరాకరించడంతో.. విచక్షణారహితంగా కత్తితో నరికి.. ఆ కిరాతకులు డబ్బుసంచితో పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement