లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్‌లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.
అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది.
In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g
— Piyush Rai (@Benarasiyaa) December 27, 2023
కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ
— Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023
Comments
Please login to add a commentAdd a comment