
సాక్షి, విజయవాడ: విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ భూ కబ్జా బాగోతం మరిచిపోకముందే.. మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది. దీంతో భూకబ్జాకు నిరసనగా మంగళవారం కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు. అక్రమణకు గురైన స్థలంలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆక్రమణకు గురైన స్థలంలో ఉన్న బోర్డులు, జెండాలను విద్యార్థులు పీకేశారు. ప్రోక్లైన్లతో స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించారు. బొండా ఉమ అండతోనే రూ. 300 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కాలేజీ స్ధలాన్ని అప్రగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, విద్యార్థుల ఆందోళనతో బీఆర్‌టీఎస్ రోడ్డులో భారీగా పోలీసులు మొహరించారు.
Comments
Please login to add a commentAdd a comment