
శ్రీనివాసరావు, నరసింహ నంది, బాపిరాజు
‘‘డిగ్రీ కాలేజ్’ సినిమా పోస్టర్లలో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు, మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు స్టేషన్‌కి పిలిపించి అభ్యంతరకర పోస్టర్స్‌ను తొలగించమని చెప్పారు. నన్ను అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అన్నారు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ చిత్రం నేడు విడుదలవుతోంది. విలేకరుల సమావేశంలో నరసింహ నంది, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు, సహ నిర్మాతలు ఆలేటి శ్రీనివాసరావు, కొండయ్య మాట్లాడుతూ– ‘‘పోస్టర్లను చూసి సినిమా ఆపేస్తామనడం సమంజసం కాదు. అభ్యంతరకరంగా ఉన్న రెండు పోస్టర్స్‌ను వెంటనే తొలగించే పని మొదలు పెట్టాం. ఈ సినిమా ఆగిపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి’’ అన్నారు.