
బిగ్‌బాస్ షో తన జీవితాన్ని, లైఫ్‌స్టైల్‌ను మార్చేసిందని నటుడు వరుణ్ అన్నారు. ఈ మేరకు చెన్నై వెస్ట్ మాంబలం, దురైస్వామి సబ్‌వే వద్ద మహిళల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మహా ఉమెన్స్ బ్యూటీ అవుట్‌లెట్‌ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం నటుడు వరుణ్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం లభించటమే తన అదృష్టం అని.. దీని ద్వారా తనకు ఎంతో క్రేజ్‌తో పాటు సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తున్నట్టు తెలిపారు.
ఒక్కమాటలో చెప్పాలంటే తన జీవితాన్ని బిగ్‌బాస్ షో మార్చేసిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మహాబ్యూటీ గ్రూప్ వ్యవస్థాపకురాలు మహాలక్ష్మి కమల కన్నన్ మాట్లాడుతూ.. రకరకాల పోరాటాల మధ్య అందాల కళను రేపటి తరానికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మహాబ్యూటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించామని, ఇక్కడ చదివిన విద్యార్థులు వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తూ జీవితంలో స్థిరపడ్డారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాంజైజ్ పార్టనర్ మణిమొళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment