
స్నేహిత్, వరుణ్‌లకు టైటిల్స్
స్టేట్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫిడేల్ ఆర్. స్నేహిత్, వరుణ్ శంకర్‌లు టైటిల్స్ సాధించారు. ఖమ్మంలోని జూబ్లీ క్లబ్‌లో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ టీటీ అకాడమీ (జీటీటీఏ) కుర్రాళ్లు బాలుర విభాగంలో, గుజరాతీ సేవామండలి (జీఎస్‌ఎం) అమ్మాయిలు బాలికల విభాగంలో విజేతలుగా నిలిచారు. సబ్-జూనియర్ బాలుర తుదిపోరులో ఫిడేల్ ఆర్. స్నేహిత్ (జీటీటీఏ) 10-12, 9-11, 11-4, 11-9, 12-10, 11-2తో సాయి తేజేష్ (సెయింట్ పాల్ అకాడమీ)పై గెలుపొందగా, బాలికల ఈవెంట్‌లో జి.ప్రణీత (జీఎస్‌ఎం) 11-5, 12-10, 9-11, 18-16, 12-10తో వి.లాస్య (ఆనంద్‌నగర్ వెల్ఫేర్ సంఘం-ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించింది. క్యాడెట్ బాలుర టైటిల్ పోరులో బి.వరుణ్ (జీటీటీఏ) 11-9, 11-8, 12-10తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై నెగ్గగా, భవిత (జీఎస్‌ఎం) 11-2, 11-8, 9-11, 5-11, 12-10తో అంజలి (జీఎస్‌ఎం)పై గెలిచింది.