హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో విఘ్నయ్ రెడ్డి, వరుణి జైశ్వాల్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్‌బీఐ)11-08, 09-11, 11-02, 11-08తో అమన్ (ఐటీ)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో వరుణి జై శ్వాల్ (జీఎస్‌ఎమ్) 11-09, 07-11, 11-09, 05-11, 08-11, 11-07, 11-07తో నైనా జైశ్వాల్ (ఎల్‌బీఎస్)ను ఓడించింది.
జూనియర్ బాలికల విభాగంలో నైనా జైశ్వాల్ 11-08, 11-07, 11-09, 11-06తో వరుణిపై గెలిచి టైటిల్‌ను సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నీలిమ, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు కె.కె.మహేశ్వర్, సంయుక్త కార్యదర్శి నరసింహారావు, సెయింట్ పాల్ హైస్కూల్ ప్రిన్సిపల్ రాయప్పరెడ్డి పాల్గొన్నారు.