విజ్ఞాన్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన టేబుల్ టెన్నిస్‌లో విజ్ఞాన్ ప్రబోధానంద ప్రశాంతి నికేతన్ స్కూల్ విజేతగా నిలిచింది. దాదాపు 20 జట్లు పాల్గొన్న ఈ మీట్‌లో 1,500 మంది ప్లేయర్లు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: విజ్ఞాన్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన టేబుల్ టెన్నిస్‌లో విజ్ఞాన్ ప్రబోధానంద ప్రశాంతి నికేతన్ స్కూల్ విజేతగా నిలిచింది. దాదాపు 20 జట్లు పాల్గొన్న ఈ మీట్‌లో 1,500 మంది ప్లేయర్లు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు.
కబడ్డీలో చేరియాల సెరినిటి మోడల్ హైస్కూల్‌కు టైటిల్ దక్కగా, జీసెస్ వే ఇంటర్నేషనల్ హైస్కూల్ రన్నరప్‌గా నిలిచింది. చెస్‌లో విజ్ఞాన్ స్కూల్ (ఈసీఐఎల్), జీ హైస్కూల్ తొలి రెండు స్థానాలను గెలుచుకున్నాయి. బాలికల వాలీబాల్‌లో విజ్ఞాన్ స్కూల్ (సరూర్‌నగర్) చాంపియన్‌గా, సెయింట్ జోసెఫ్ స్కూల్ (రామంతాపురం) రన్నర్‌గా నిలిచాయి. జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, ఆర్‌టీసీ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.కిరణ్‌రెడ్డి బహుమతులు అందజేశారు.