వాస్తవ ప్రేమకథ | Degree college release date announcement | Sakshi
Sakshi News home page

వాస్తవ ప్రేమకథ

Published Sat, Feb 1 2020 6:28 AM | Last Updated on Sat, Feb 1 2020 6:28 AM

Degree college release date announcement - Sakshi

వరుణ్, దివ్యారావు జంటగా ‘1940లో ఒకగ్రామం, కమలతో నా ప్రయాణం’ చిత్రాల ఫేమ్‌ నరసింహ నంది స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్‌’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘నా గత చిత్రాల మాదిరిగా కాకుండా కమర్షియల్‌ అంశాలతో ఈ సినిమా తీశాను. ఇద్దరు డిగ్రీ కాలేజ్‌ స్టూడెంట్స్‌ మధ్య క్లాస్‌రూమ్‌లోనూ బయట అంకురించిన వాస్తవ ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు నరసింహæనంది. ‘‘ఈ సినిమాలో భావోద్వేగభరితమైన అంశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని నా ఆధ్వర్యంలో విడుదల చేయాలనుకున్నాను’’ అన్నారు పంపిణీదారుడు బాపిరాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement