ఆధిక్యంలో వరుణ్ | international grand masters tournment varun in lead position | Sakshi
Sakshi News home page

ఆధిక్యంలో వరుణ్

Published Sat, Nov 30 2013 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

international grand masters tournment varun in lead position

జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా  నిర్వహిస్తున్న ‘బి’ కేటగిరీ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుణ్ సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో వరుణ్ (3 పాయింట్లు) పశ్చిమ బెంగాల్‌కు చెందిన షౌన్ చౌదరి (2)పై విజయం సాధించాడు.
 
  విశ్వనాథ్ ప్రసాద్ (3) మన రాష్ట్రానికే చెందిన భరత్ కుమార్ రెడ్డి (2)పై గెలిచాడు. ఈ విజయాలతో వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్ ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు టాప్ సీడ్ లోకేష్ (తమిళనాడు) గోవాకు చెందిన అమేయతో డ్రా చేసుకున్నాడు. ప్రేమ్ రాజ్ (2) తమిళ నాడు ఆటగాడు రతన్వేల్ (3) చేతిలో, కళ్యాణ్ కుమార్ (2) ఢిల్లీకి చెందిన ఆన్ష్ గుప్తా (3) చేతిలో ఓటమి చవిచూశారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 రమణ బాబు (3)... లక్ష్మీ కృష్ణ భూషణ్ (2)పై, బైవాబ్ మిశ్రా (3)... హృతికేష్ (2)పై, శ్రీకాంత్ (3)... ఖాన్ (2)పై, నవీన్ ఎస్. హెగ్డే (3)... ప్రజ్ఞానంద్ (2)పై, శైలేష్ ద్రవిడ్ (3)... సర్బోజిత్ పాల్ (2)పై, రుతుజా బక్షీ (3)... భవిక్ భారంబే (2)పై, సమ్మద్ జయకుమార్ (3)... శ్రద్దాంజలి జేన(2)పై, భరత్ కళ్యాణ్ (3)... అమినిస్మాయిల్ ఖాద్రీ (2)పై, హేమంత్ రామ్ (3)... కుషాగ్ర మోహ న్ (2)పై, విజయ్ ఆనంద్ (3)... ఆదిత్య (2)పై నెగ్గారు. మాజీద్ (2.5)... జితేంద్ర (2.5)తో, కాంతిలాల్ దేవ్ (2.5)... రాఘవ్ శ్రీవాస్తవ్ (2.5)తో, తమల్ చక్రవర్తి (2.5)... అభిషేక్ (2.5)తో, విశ్వేశ్వర్ (2.5)... వినాయక్ కులకర్ణి (2.5)తో, శరణ్య (2.5)... రూప్ సౌరవ్ (2.5)తో డ్రా చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement