Grand masters tournment
-
మహిళా గ్రాండ్ మాస్టర్‌కు ‘శాప్’ సత్కారం
సాక్షి, అమరావతి: మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక విజయం రాష్ట్రానికి గర్వకారణమని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి కొనియాడారు. ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్ షిప్లో 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించడంపై అభినందించారు. గురువారం విజయవాడలోని శాప్ కార్యాలయంలో ప్రియాంకను ఘనంగా సత్కరించారు. ప్రియాంక మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు, విదేశీ కోచ్‌ల ద్వారా శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా శాప్ చైర్మన్, ఎండీలు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. -
బాలచంద్రకు మరో విజయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తన జోరు కొనసాగిస్తున్నాడు. ఇక్కడి కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం ఆరో రౌండ్లో ప్రసాద్ విజయం దక్కించుకున్నాడు. తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి, ఇంటర్నేషనల్ మాస్టర్ రవిచంద్రన్ సిద్ధార్థ్‌పై అతను సంచలన విజయం సాధించాడు. రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి ఆటగాడు, గ్రాండ్‌మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబు, మరో జీఎం దీపన్ చక్రవర్తితో జరిగిన తన ఆరో రౌండ్ గేమ్‌ను డ్రాగా ముగించాడు. ఫలితంగా ఆరు రౌండ్లు ముగిసే సరికి 4 పాయింట్లతో పట్టికలో మరింత దిగజారి 16వ స్థానంలో నిలిచాడు. బాలచంద్ర 19వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఏపీ అమ్మాయి బొడ్డా ప్రత్యూష... వైషాలితో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకుంది. రాష్ట్రానికి చెందిన రవితేజ, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఆటగాడు మొజరోవ్ మిఖాయిల్ చేతిలో, వైవీకే చక్రవర్తి... విశాఖ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఓవరాల్‌గా ఆరు రౌండ్లు ముగిసిన తర్వాత భారత్‌కు చెందిన ఎస్పీ సేతురామన్ (5.5 పాయింట్లు) ఒక్కడే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత విదిత్ గుజరాతీ (4.5-ఆరో స్థానం) ఒక్కడే టాప్-10 ఉన్న భారత ఆటగాడు. -
ఆధిక్యంలో వరుణ్
జింఖానా, న్యూస్‌లైన్: ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న ‘బి’ కేటగిరీ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వరుణ్ సంయుక్త ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో వరుణ్ (3 పాయింట్లు) పశ్చిమ బెంగాల్‌కు చెందిన షౌన్ చౌదరి (2)పై విజయం సాధించాడు. విశ్వనాథ్ ప్రసాద్ (3) మన రాష్ట్రానికే చెందిన భరత్ కుమార్ రెడ్డి (2)పై గెలిచాడు. ఈ విజయాలతో వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్ ఉమ్మడిగా ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు టాప్ సీడ్ లోకేష్ (తమిళనాడు) గోవాకు చెందిన అమేయతో డ్రా చేసుకున్నాడు. ప్రేమ్ రాజ్ (2) తమిళ నాడు ఆటగాడు రతన్వేల్ (3) చేతిలో, కళ్యాణ్ కుమార్ (2) ఢిల్లీకి చెందిన ఆన్ష్ గుప్తా (3) చేతిలో ఓటమి చవిచూశారు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు రమణ బాబు (3)... లక్ష్మీ కృష్ణ భూషణ్ (2)పై, బైవాబ్ మిశ్రా (3)... హృతికేష్ (2)పై, శ్రీకాంత్ (3)... ఖాన్ (2)పై, నవీన్ ఎస్. హెగ్డే (3)... ప్రజ్ఞానంద్ (2)పై, శైలేష్ ద్రవిడ్ (3)... సర్బోజిత్ పాల్ (2)పై, రుతుజా బక్షీ (3)... భవిక్ భారంబే (2)పై, సమ్మద్ జయకుమార్ (3)... శ్రద్దాంజలి జేన(2)పై, భరత్ కళ్యాణ్ (3)... అమినిస్మాయిల్ ఖాద్రీ (2)పై, హేమంత్ రామ్ (3)... కుషాగ్ర మోహ న్ (2)పై, విజయ్ ఆనంద్ (3)... ఆదిత్య (2)పై నెగ్గారు. మాజీద్ (2.5)... జితేంద్ర (2.5)తో, కాంతిలాల్ దేవ్ (2.5)... రాఘవ్ శ్రీవాస్తవ్ (2.5)తో, తమల్ చక్రవర్తి (2.5)... అభిషేక్ (2.5)తో, విశ్వేశ్వర్ (2.5)... వినాయక్ కులకర్ణి (2.5)తో, శరణ్య (2.5)... రూప్ సౌరవ్ (2.5)తో డ్రా చేసుకున్నారు.