యువతరం ప్రేమకథ
వరుణ్, దినేష్, ప్రశాంత్, షిప్రా గౌర్, హేమలత, కల్పన, కావ్య, పృధ్వీ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. యన్నీ కె. దర్శకత్వంలో సంగీత్, హబీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది.
ముహూర్తపు దృశ్యానికి వీఎన్ ఆదిత్య కెమెరా స్విచాన్ చేయగా, సూర్యకిరణ్ క్లాప్ ఇచ్చారు. ప్రేమతో పాటు అన్ని రకాల ఎలిమెంట్సూ ఉన్న కథాంశమిదని దర్శకుడు చెప్పారు.
ఆర్‌ఎఫ్‌సీలో సెట్ వేస్తున్నామని, ఓ పదిరోజుల్లో షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె.సేన, సంగీతం: జె.వర్ధన్, కళ: డేవిడ్.