చెస్ చాంప్స్ రోహిత్, వరుణ్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో రోహిత్ రెడ్డి, వరుణ్ సత్తా చాటారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీలో జూనియర్స్ విభాగంలో రోహిత్, ఓపెన్ విభాగంలో వరుణ్ చాంపియన్లుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో ఆరురౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో రోహిత్ రెడ్డి, కృష్ణ దేవర్‡్ష సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా రోహిత్ విజేతగా నిలవగా... కృష్ణ దేవర్‡్ష రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 5 పాయింట్లతో గండికోట రిత్విక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఓపెన్ కేటగిరీలో ఆరు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లు సాధించిన వి.వరుణ్ విజేతగా నిలిచాడు. రాఘవ శ్రీవాత్సవ, కార్తీక్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్–14 విభాగంలో కృష్ణ దేవర్‡్ష, శ్రీశాంతి... అండర్–12 విభాగంలో హృషికేశ్ అనీశ్, ఎ. భవిష్య... అండర్–10 విభాగంలో జి.రిత్విక్, సమీర, అండర్–8 విభాగంలో చిద్విలాస్ సాయి, శరణ్య విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో జేఆర్‌సీ ప్రసాద్ ‘బెస్ట్ వెటరన్’ పురస్కారాన్ని గెలుచుకోగా... వి. సరయుకు ‘బెస్ట్ ఉమెన్’ అవార్డు దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ కె. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.
జూనియర్స్ కేటగిరీ ఆరోరౌండ్ గేమ్ ఫలితాలు
రిత్విక్ (5)... శ్రీశాంతి (4)పై, ప్రియాన్‡్ష రెడ్డి (4.5)... భవిష్య (3)పై, ఆర్ణవ్ ప్రధాన్ (4.5)... జి. విశాల్‌పై గెలుపొందారు. రోహిత్‌రెడ్డి (5.5), కృష్ణ దేవర్‡్ష (5.5)... చిద్విలాస సాయి (4.5), సిద్ధార్థ్ దేశ్‌పాండే (4)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి.
ఓపెన్ కేటగిరీ ఆరోరౌండ్ గేమ్ ఫలితాలు: రాఘవ శ్రీవాత్సవ (5)... రాజు (4)పై, షణ్ముఖ తేజ (5)... సురేశ్ బాబు (4)పై, దిగ్విజయ్ సునీల్ (4.5)... సత్యనారాయణ (3.5)పై నెగ్గారు. కార్తీక్ కుమార్ ప్రదీప్ (5), వరుణ్ (5.5)... ప్రతీక్ శ్రీవాస్తవ (4), శ్రీవిజయ్ సునీల్ (4)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి.