
అహ్మదాబాద్: జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌తో తెలుగు కుర్రాడు గ్రాండ్‌మాస్టర్ ముసు నూరి రోహిత్ లలిత్‌బాబు విజేతగా నిలిచాడు. గుజరాత్‌లో శుక్రవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ స్వప్నిల్ దోపాడే (ఇండియన్ రైల్వేస్)పై లలిత్‌బాబు (పీఎస్‌పీబీ) విజయం సాధించాడు.
దీంతో 9.5 పాయింట్లతో అరవింద్ చిదంబరంతో కలిసి లలిత్‌బాబు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా లలిత్ టైటిల్‌ను దక్కించుకోగా అరవింద్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.