అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్ | puri jagannath in sucsess tour for lofer | Sakshi
Sakshi News home page

అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్

Published Sat, Dec 26 2015 10:33 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు  - పూరి జగన్నాథ్ - Sakshi

అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు - పూరి జగన్నాథ్

 ‘‘సక్సెస్ టూర్‌కి ఎక్కడికి వెళ్లినా అందరూ వరుణ్ గురించే అడుగుతున్నారు. మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. ‘మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా’అని రేవతి గారిని ఒకరు అడిగారట. ఇక పోసాని గారైతే తాను దాదాపు 5 వేల కాల్స్ రిసీవ్ చేసుకున్నానని చెప్పారు’’ అని పూరి జగన్నాథ్ తెలిపారు. 

వరుణ్, దిశా పాట్ని జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మించిన ‘లోఫర్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా సక్సెస్ టూర్‌ను చిత్రబృందం నిర్వహించింది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ- ‘‘ ‘కంచె’తో ఈ ఏడాదిని మొదలుపెట్టి, ‘లోఫర్’తో పూర్తి చేయడం హ్యాపీగా ఉంది’’ అని  అన్నారు. రచయిత సుద్దాల అశోక్‌తేజ, సహ నిర్మాత సీవీరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement