ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్! | He is the inspiration for me! | Sakshi
Sakshi News home page

ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్!

Dec 16 2015 11:18 PM | Updated on Mar 22 2019 1:53 PM

ఆయనే  నాకు  ఇన్‌స్పిరేషన్! - Sakshi

ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్!

తొలి సినిమానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు దిశా పాట్నీ.

తొలి సినిమానే  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు దిశా పాట్నీ. వరుణ్‌తేజ్ హీరోగా ఆమె నటించిన ‘లోఫర్’ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె చెప్పిన కబుర్లు...  మాది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ఇప్పుడు బరేలీలో ఉంటున్నాం. మా అక్క ఆర్మీలో వర్క్ చేస్తోంది. నేను చదువుకుంటున్నప్పుడు మోడల్‌గా పనిచేసే అవకాశం రావడంతో ఇటు వైపు వచ్చాను.  రెండేళ్ల క్రితమే ఓ సినిమా కోసం పూరి గారి దగ్గరకు ఆడిషన్‌కు వెళ్లాను. అప్పుడు నాకు అవకాశం రాలేదు. ఈ  సినిమా కోసం పూరీ గారు మళ్లీ కాల్ చేసి, అవకాశమిచ్చారు.

 పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. పగలంతా షూటింగ్‌లో ఉంటూ, రాత్రి సీన్స్‌ను ఎడిట్ చేసేవారు. మళ్లీ వేరే సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకునేవారు. అంత పనిచేస్తున్నా ఆయనలో అసలు స్ట్రెస్ కనిపించేది కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా దక్షిణాదిలో టాప్ డెరైక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారంటే ఈ  కష్టమే కారణం. ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్.   ప్రస్తుతం హిందీలో టైగర్ ష్రాఫ్‌తో ఓ సినిమా చేస్తున్నా. అది ఏప్రిల్‌లో విడుదలవుతుంది. ఇంకో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement