varuntej
-
ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం
-
‘‘ఎఫ్ 3’ ట్రిపుల్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘గని’ విడుదలపై చిత్రబృందం క్లారిటీ
వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్. కాగా థియేట్రికల్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘గని’ కోసం ఎంతో కష్టపడ్డాం. క్లిష్టమైన లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఖరీదైన సెట్స్ వేశాం. విజువల్‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుంది. కరోనా పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా చిత్రాలు రిలీజ్‌కి పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని, పోటీ వద్దనుకుని మా సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. ‘గని’ చిత్రం థియేటర్స్‌లోనే వస్తుంది’’ అని శుక్రవారం చిత్రబృందం పేర్కొంది. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజవుతుందనే ప్రచారం సాగుతోంది. -
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్
-
అంతరిక్షంలో ఏం జరిగింది?
‘ఫిదా, తొలిప్రేమ’ వంటి హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’. లావణ్యా త్రిపాఠి, అదితీరావు హైదరీ కథానాయికలు. తొలి చిత్రం ‘ఘాజీ’తో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించనున్నారు. ఈ టీజర్‌లోని సన్నివేశాలు సినిమాపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. అంతరిక్షంలో ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నారు. -
స్క్రీన్ ప్లే 13th August 2018
-
పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమా
‘కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు జ్ఞానశేఖర్. మొదటిసారి ఆయన నిర్మాతగా మారారు. శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్లో రమేష్ కరుతూరితో కలిసి జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు చిత్రబృందం. పెళ్లి తర్వాత శ్రియ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్. -
సండే లంచ్ విత్ ఫ్యామిలీ
వరుణ్‌తేజ్ తెలుగు సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారమ్. ప్రస్తుతం ఈ సిన్మా పనులతో బిజీగా ఉన్న వరుణ్, నిన్న(ఆదివారం) ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ‘సండే లంచ్ విత్ ఫ్యామిలీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. -
వేలంటైన్ వీక్‌లో... తొలిప్రేమ
ఫిబ్రవరి... ప్రేమికులకు వెరీ స్పెషల్ మంత్! ఎందుకో స్పెషల్‌గా చెప్పాలా? ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే! 14కి ముందు వారం రోజులు... ఒక్కో రోజునూ ఒక్కో పేరుతో సెలబ్రేట్ చేస్తారు. దటీజ్ వేలంటైన్స్ వీక్. సో, ప్రేమికులకు వెరీ వెరీ స్పెషల్ వీక్. అప్పుడే వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ను ప్రేక్షకులందరికీ చూపిస్తారట! వరుణ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్థపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘తొలిప్రేమ’ టైటిల్ ఖరారు చేశారట. వచ్చే ఏడాది వేలంటైన్స్ వీక్‌లో చాక్లెట్ డే (ఫిబ్రవరి 9)న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇటీవల 40 రోజులు ఏకధాటిగా లండన్‌లో చేసిన షెడ్యూల్‌తో 70 శాతం సినిమా పూర్తయింది. డిసెంబర్‌కి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. తమన్ సంగీతం, జార్జ్ సి. విలియమన్స్ ఛాయాగ్రహణం చిత్రానికి పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. -
బుడ్డోడు ముద్దొస్తున్నాడు!
ముద్దుకు మరింత ముద్దొచ్చింది... బుడ్డోణ్ణి చూడగానే! మరి, ముద్దుగుమ్మ రాశీ ఖన్నా మాత్రం ఎందుకు ఊరుకుంటారు? వెంటనే చేతుల్లోకి తీసుకుని బుగ్గలపై ముద్దులిచ్చేశారు. రాశి ముద్దుల్లో మాధుర్యం తెలిసే వయసు కాదు కదా ఆ బుడ్డోడిది? అందువల్లే బుంగమూతి పెట్టినట్టున్నాడు. అయినా... వాణ్ణి రాశి వదల్లేదు. కాసేపు ఆడుకున్నారు. తర్వాత బ్యాక్ టు షూట్! లండన్‌లోని ‘తొలిప్రేమ’ లొకేషన్లో సీన్ ఇది! వరుణ్‌తేజ్‌కి జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్న చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ‘తొలిప్రేమ’ చిత్రీకరణ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. టైమ్ వేస్ట్ చేయకుండా వీలైతే రాత్రిపూట కూడా షూటింగ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్... రాశీ ఖన్నా గరిటె తిప్పడం వంటివి. మరి.. ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో తిన్నోళ్లే చెప్పాలి!! -
వరుణ్‌ది తొలిప్రేమే!
తొలి ప్రేమను మరచిపోవడం అంత సులువు కాదు. రియల్ లైఫ్ లవ్ ఇది. రీల్‌పై వచ్చిన పవన్ కల్యాణ్ ‘తొలి ప్రేమ’నూ అంత ఈజీగా మరచి పోలేం. బాబాయ్ పవన్‌కల్యాణ్ కెరీర్లో మంచి హిట్‌గా నిలిచిన ఈ చిత్రం పేరునే అబ్బాయ్ వరుణ్‌తేజ్ కొత్త సినిమాకు ఖరారు చేశారని సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా టైటిలే ‘తొలి ప్రేమ’. -
తప్పదు... గట్టిగా తిట్టాలి!
స్టోరీ డిమాండ్ చేస్తే హీరోలు ఫైట్ చేయాలి. ఫైట్ చేయాలంటే బాడీ ఫిట్‌గా ఉండాలి. బాడీ ఫిట్‌గా ఉండాలంటే డైలీ జిమ్‌లో వర్కౌట్స్ చేయాలి. డైలీ వర్కౌట్స్ చేయాలంటే... జిమ్ ట్రైనర్ హీరో చేత బాగా వర్కౌట్స్ చేయించాలి. అలా చేయించాలంటే... ట్రైనర్‌ను గట్టిగా తిట్టాలంటున్నారు వరుణ్‌తేజ్! ఎవరైనా తిడితే ట్రైనింగ్ బాగా ఇస్తారా? ఏదో బతిమాలో... బుజ్జగించో... ట్రైనింగ్ తీసుకోవాలి గానీ అంటారా! వరుణ్‌తేజ్ మాత్రం గట్టిగా తిట్టాలని ట్వీట్ చేశారు. వరుణ్ వర్కౌట్స్ చేస్తానంటుంటే అతని ట్రైనర్ కులదీప్ సేథి ‘ఇక చాల్లే’ అని వెళ్లిపోతున్నట్టున్నారు! వెంటనే ఫొటో తీసి ‘‘వర్కౌట్స్ టైమ్‌లో ట్రైనర్‌ను గట్టిగా తిట్టకపోతే... నీకు సరిపడా ట్రైనింగ్ ఇవ్వడు. లివ్ ఫిట్... బి స్ట్రాంగ్’’ అని వరుణ్‌తేజ్ ట్వీట్ చేశారు. -
మిస్టర్ లవ్‌స్టోరీ
రివ్యూ: మిస్టర్ చిత్రం: ‘మిస్టర్’ తారాగణం: వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్... కెమేరా: కేవీ గుహన్ కథ: గోపీమోహన్ మాటలు: శ్రీధర్ సీపాన సంగీతం: మిక్కీ జె. మేయర్ నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్, ‘ఠాగూర్’ మధు స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: శ్రీను వైట్ల విడుదల తేదీ: 14–ఏప్రిల్–2017 ‘మనం ప్రేమను వెతుక్కుంటూ వెళితే... ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది’ అనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్’. వరుణ్‌తేజ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఇందులో లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లు. సినిమాలో ‘మిస్టర్’ ఎవరి ప్రేమను వెతుక్కుంటూ వెళ్లాడు? ఎవరి ప్రేమ అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది? ఓ లుక్కేయండి. కథ: చై (వరుణ్ తేజ్)ది సిక్స్ ఫీట్ ప్లస్ కటౌట్. ఈ కుర్రాడి అసలు పేరు పిచ్చయ్య నాయుడు.. స్పెయిన్‌లో ఉంటున్నాడు కదా, ట్రెండీగా ఉంటుందని ‘చై’ అని పెట్టుకుంటాడు. పేరొక్కటే మారింది గానీ... (ఇండియన్) పద్ధతులు, గట్రా కుర్రాడిలో ఉన్నాయండోయ్! చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం. ఓ రోజు స్పెయిన్ వస్తున్న ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రియాను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వెళతాడు. ప్రియాను చూడగానే ఫ్లాట్. చెప్పేదేముంది? లవ్‌లో పడిపోతాడు. కానీ, ట్విస్ట్ ఏంటంటే... ఆ అమ్మాయి ప్రియా కాదు, మీరా (హెబ్బా పటేల్). రాంగ్ అమ్మాయిని పికప్ చేసుకుంటాడు. ఆ విషయం తెలిసే సరికి ఆ అమ్మాయితో లవ్‌లో పడిపోతాడు. మీరాను మిస్ చేసుకోకూడదనీ, మిస్సెస్ చేసుకోవాలనీ స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవుతాడు. దాంతో పాప స్పెయిన్‌లో ఉన్నన్ని రోజులూ తమ ఇంట్లో ఉండేలా ప్లాన్ చేస్తాడు చై. మీరా క్లోజ్‌గా మూవ్ అవుతుంటే తనతో ప్రేమలో పడిందనుకుంటాడు. కట్ చేస్తే... కుర్రాడిలో సంతోషానికి కట్ చెబుతూ.. ఆల్రెడీ ఇండియాలో సిద్ధార్థ్ (ప్రిన్స్)తో లవ్‌లో పడ్డానని మీరా షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది. అతణ్ణే పెళ్లిచేసుకోవాలనుకుంటున్నాని ఇండియా చెక్కేస్తుంది. పాపం... పస్ట్ లవ్ ఫ్లాపైన బాధలో చై స్పెయిన్‌లో చక్కర్లు కొడుతుంటాడు. సడన్‌గా మీరాను నుంచి ఫోన్... సిద్ధార్థ్ హ్యాండిచ్చాడని చెబుతుంది. ఇంకో కుర్రాడైతే ఛాన్స్ మళ్లీ రాదని మీరాను బుట్టలో వేసుకోవాలని ప్లానులు, గట్రా వేసేవాడేమో? ‘చై’ మాత్రం మీరా లవ్‌కి హెల్ప్ చేయాలని ఇండియా వెళతాడు. ఎందుకంటే... కొంచెం కల్చర్ ఉన్న కుర్రాడు, అందరికీ ప్రేమను పంచాలనే గుణం ఉన్నవాడు. ఇక్కడ ఇంకో ట్విస్ట్... మీరాకు హెల్ప్ చేసే టైమ్‌లో నచ్చని పెళ్లి చేస్తున్నారని ఇంటినుంచి పారిపోయి వచ్చిన చంద్రముఖి (లావణ్యా త్రిపాఠి) చైకు పరిచయం అవుతుంది. రాయల వంశానికి చెందిన అమ్మాయి తను. ఆమెను కొందరు అత్యాచారం చేయబోయేతే చై కాపాడతాడు. చంద్రముఖి అతణ్ణి లవ్ చేయడం మొదలు పెడుతుంది. ఈలోపు రాయల వంశస్తులు తమ ఇంటి ఆడపిల్లను చై లేవదీసుకుపోయాడనుకుని, చంపేయాలనుకుంటారు. చైని బంధించి, రాజ దర్బారులో మరణ శిక్ష ఖరారు చేస్తారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్.. మనసు మార్చుకుని చంద్రముఖిని చైకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఇప్పుడింకో ట్విస్ట్. మీరా కూడా మనసు మార్చుకుంటుంది. చైని లవ్ చేయడం మొదలుపెడుతుంది. అతడూ ఆమెను లవ్ చేస్తున్నాడని తెలుసుకుంటుంది. దాంతో చంద్రముఖిని సాఫ్ట్‌గా సైడ్ చేసి, ‘చై’తో సెటిల్ కావాలనుకుంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరు అమ్మాయిలకూ ఓ కథ ఉన్నట్లే చైకి కూడా ఓ స్టోరీ ఉంది. ఇండియాలో ఉన్న తాతయ్యను కలవడానికి ఈ మనవడు ఇష్టపడడు. తాతయ్య అంటే చైకి ఎందుకు కోపం? తాతయ్యను కలిశాడా? లేదా? ఇద్దరమ్మాయిల్లో ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? ‘చై’ను పై లోకాలకు పార్శిల్ చేయాలనుకున్న చంద్రముఖి ఫ్యామిలీ ఎందుకు నిర్ణయం మార్చుకుంది? అసలు ‘చై’ బ్యాగ్రౌండ్ ఏంటి? అనేవన్నీ చెప్పేస్తే.... సినిమా చూడబోయే ప్రేక్షకులకు థ్రిల్ మిస్ అవుతుంది. విశ్లేషణ: మొత్తం ముగ్గురి కథలతో, ఆ కథలతో సంబంధం ఉన్న పాత్రలతో కొత్త డిజైన్‌లో న్యూ అప్రోచ్‌లో స్క్రీన్‌ప్లే అల్లినట్లుగా అనిపిస్తుంది. అందరివీ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలే. తెరనిండా ఆర్టిస్టులే. వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్ బాగున్నట్లు అనిపిస్తాయి. లావణ్యా త్రిపాఠి, హెబ్బా పటేల్ తమ పాత్రలకు న్యాయం చేయడానికి కృషి చేశారు. రఘుబాబు ‘ఊపిరి’ స్పూఫ్, దర్శకుడి పాత్రలో పృథ్వీ కామెడీ ట్రాక్, గాంధేయవాదంతో షకలక శంకర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తనికెళ్ల భరణి, నాజర్, మురళీ శర్మ, రమేష్ అరవింద్‌ల నటనకు వంక పెట్టలేం. కేవీ గుహన్ సినిమాటోగ్రఫీ ఐ–ఫీస్ట్‌గా ఉంటుంది. మిక్కీ జె. మేయర్ బాణీల్లో ‘ప్రియ స్వాగతం...’, ‘సయ్యోరే సయ్యోరే...’ క్యాచీగా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్‌లో రిచ్‌నెస్ కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ శ్రీను వైట్ల మార్క్ టేకింగ్, కామెడీ టైమింగ్‌తో సాగే కమర్షియల్ ఫార్మాట్ మూవీ ఇది. -
చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే...
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై తాను చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు. తనపై చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని పేర్కొన్నారు. ‘చిరంజీవి లాంటి అన్నయ్య నాకుంటే నేను మాట్లాడిన మాటలకి కొట్టేవాడిని. నాగబాబు మాటలతో వదిలేశాడు. ఆయనకు నిజంగా క్షమాపణ చెబుతున్నా’ని వర్మ ట్వీట్ చేశారు. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ కూడా ఆయన క్షమాపణ చెప్పారు. ‘వరుణ్ తేజ్.. మీ నాన్న గురించి నాపై చేసిన కామెంట్లు చదివాను. నువ్వు చెప్పింది కరెక్ట్. నా మాటలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ ఇద్దరికీ క్షమాపణలు చెబుతున్నాన’ని ట్విటర్ లో పేర్కొన్నారు. ఖైదీ నెం. 150 సినిమా ప్రీ లాంచ్ వేడుకలో నాగబాబు.. రాంగోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడంతో వివాదం మొదలైంది. నాగబాబు వ్యాఖ్యలపై వర్మ ట్విటర్ వేదికగా కామెంట్లు చేశారు. @IAmVarunTej i read ur comments on me about ur dad nd u ar right..it was wrong on my part to say hurtful things nd I apologise to u both — Ram Gopal Varma (@RGVzoomin) 14 April 2017 -
నేను భయపడే టైప్ కాదు!
‘‘నేను ఎలాంటి చిత్రం చేసినా... ప్రేక్షకులు నా నుంచి ఆశించే వినోదం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయను. అలాగే, ఇక నుంచి ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేకుండా... పూర్తి భిన్నమైన కొత్త తరహా చిత్రాలు చేయాలనే ఆలోచనతో ఉన్నా’’ అన్నారు శ్రీను వైట్ల. వరుణ్‌తేజ్ హీరోగా ఆయన దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘మిస్టర్’ ఈ నెల 14న రిలీజవుతోంది. శ్రీను వైట్ల మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు వరుణ్‌ను చూసి ‘బాగున్నాడీ అబ్బాయి’ అంటే... నాగబాబు అన్నయ్య ‘నువ్వు సినిమా తీయొచ్చుగా’ అనేవారు. తప్పకుండా అనేవాణ్ణి. ముక్కోణపు ప్రేమకథతో తెరకెక్కిన ట్రావెల్ ఫిల్మ్, ఈ ‘మిస్టర్’తో కుదిరింది. లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ, డ్యాన్స్... అన్నిటిలో వరుణ్ని బాగా చూపించే ప్రయత్నం చేశా. నిర్మాతలు బుజ్జి, మధుగార్లు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టీమ్ సపోర్ట్‌తో అనుకున్నది తీశాననే సంతృప్తి ఉంది. మంచి సినిమా తీసి ఫెయిల్ అయితే బాధ ఉంటుంది. నేను అనుకున్నట్టు చేయలేని పరిస్థితులు ‘బ్రూస్ లీ’కి వచ్చాయి. మంచి సినిమా తీయలేదు కాబట్టి ప్రేక్షకులు రిజెక్ట్ చేశారని గట్టిగా నమ్మాను. ఆ సినిమాతో ప్రేక్షకుల్ని నవ్వించలేకపోయా. ‘మిస్టర్’తో నవ్విస్తా. సక్సెస్ కోసం ఈ సినిమా తీయలేదు. ప్రేక్షకులపై ప్రేమతో తీశా. నేను ఫెయిల్యూర్స్‌కి భయపడే టైప్ కాదు. నా కెరీర్ చూస్తే... ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నేను మరింత స్ట్రాంగ్‌గా పనిచేస్తా. ‘మిస్టర్’కు అలాగే పనిచేశా. కథను చెడగొట్టకుండా అందులో కామెడీ చేయడం చాలా కష్టం. కానీ, నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులు వినోదం ఆశిస్తారు. అందుకే, నేను ఎక్కువ స్ట్రగుల్ అవుతా’’ అన్నారు. -
ఇప్పుడు బాబాయ్‌తో?
‘ముకుంద’ చిత్రంలో అబ్బాయ్ వరుణ్‌తేజ్‌తో జతకట్టిన గోపికమ్మ పూజా హెగ్డే తాజాగా బాబాయ్ పవన్ కల్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందని ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్‌తో జతకట్టనున్నారు. ఇప్పటికే కీర్తి సురేశ్ ఓ హీరోయిన్గా ఎంపికయ్యారు. మరో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారట. ఆ సంగతలా ఉంచితే ‘ముకుంద’ తర్వాత హిందీలో ‘మొహెంజోదారో’ చేసిన పూజా హెగ్డే ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో నటిస్తోంది. ఇకపై తెలుగు సినిమాలపై ఆమె ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నారట. -
కంచె దాటింది
ఈ ప్రపంచం నిండా కంచెలే! మతాల మధ్య కంచెలు... కులాల మధ్య కంచెలు... ప్రాంతాల మధ్య కంచెలు... కుటుంబాల మధ్య కంచెలు... మనసుల మధ్య కంచెలు... ఇన్నింటికి కంచెలు కట్టినవారు ప్రేమకు మాత్రం కట్టలేరా? సినిమా అంటేనే క్రిష్‌కు ప్రసవ వేదన. కథ కోసం వెతుకులాట... కథ దొరికాక ఆ కథను మరింత చిక్కబరచడం కోసం పెనుగులాట... ప్రీ-ప్రొడక్షన్‌కే బోలెడంత టైమ్ తీసుకుంటాడు క్రిష్. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తర్వాత హిందీ ‘గబ్బర్’ టైమ్‌లో క్రిష్‌ని హాంట్ చేయడం మొదలు పెట్టిందో కాన్సెప్ట్. అదీ సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో. సెకండ్ వరల్డ్ వార్ గురించి వరల్డ్ లెవల్లో సినిమాలొచ్చాయి కానీ, ఇండియాలో ఎవరూ ఎటెంప్ట్ చేయలేదు. క్రిష్‌కి ఈ థాట్ రావడంతోనే పులకించిపోయాడు. దానికి తోడు ప్రేమకు కంచె కట్టడమనేది అమోఘమైన ఆలోచన. అటు సెకండ్ వరల్డ్ వార్- ఇటు లవ్ వార్ ఈ రెండింటినీ మిక్స్ చేసి టూ లేయర్స్‌లో కథ ఫిక్స్ చేశాడు.ఆరు నెలలు ఈ కథ గురించే ఆలోచన. సీన్ బై సీన్, షాట్ బై షాట్, తనలో ఆవహించుకున్నాడు. అందుకే 55 రోజుల్లో తీసేయగలిగాడు. నిజం చెప్పాలంటే - ఇంకో ఫిలిమ్ మేకరైతే ఏడాది పైగానే తీసేవాడు. ‘కంచె’ మేకింగ్ కోసం నానాకష్టాలు పడ్డాడు క్రిష్. మ్యూజియమ్స్ తిరిగాడు. గూగులంతా జల్లెడ పట్టాడు. ఆ కాలం నాటి బైక్‌లు- ట్రక్లు- హెల్మెట్లు... కొన్ని సెల్ఫ్ మేడ్. ఇంకొన్ని రెంట్‌కు. కెప్టెన్ దూపాటి హరిబాబు పాత్రకు ఒకే ఒక్క సినిమా వయసున్న వరుణ్‌తేజ్‌ను సెలక్ట్ చేసుకోవడమే క్రిష్ సాహసం. కానీ అవుట్‌పుట్ చూశాక గుడ్ సెలక్షన్ అంటారని క్రిష్‌కు ముందే తెలుసు. కొత్త నెరేషన్... సరికొత్త లొకేషన్స్... డిఫరెంట్ గెటప్స్... చిక ్కటి మాటలు... చక్కటి దృశ్యాలు... వీటన్నిటితో మనల్ని రెండో ప్రపంచయుద్ధ కాలంలోకి తీసుకెళ్లిపోయాడు.హరిబాబు- సీతల ప్రణయాన్ని ఫుల్‌గా ఆస్వాదించేలా చేశాడు. ఇదంతా క్రిష్ క్రెడిట్. అందుకే, ఇవాళ ఈ ‘కంచె’ జాతీయ స్థాయిలో కాలరెగరేసింది! తెలుగులో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నిలిచింది! క్రిష్... వియ్ సెల్యూట్ యు!! -
ఆయనే నాకు ఇన్స్పిరేషన్!
తొలి సినిమానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు దిశా పాట్నీ. వరుణ్‌తేజ్ హీరోగా ఆమె నటించిన ‘లోఫర్’ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె చెప్పిన కబుర్లు... మాది ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ఇప్పుడు బరేలీలో ఉంటున్నాం. మా అక్క ఆర్మీలో వర్క్ చేస్తోంది. నేను చదువుకుంటున్నప్పుడు మోడల్‌గా పనిచేసే అవకాశం రావడంతో ఇటు వైపు వచ్చాను. రెండేళ్ల క్రితమే ఓ సినిమా కోసం పూరి గారి దగ్గరకు ఆడిషన్‌కు వెళ్లాను. అప్పుడు నాకు అవకాశం రాలేదు. ఈ సినిమా కోసం పూరీ గారు మళ్లీ కాల్ చేసి, అవకాశమిచ్చారు. పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. పగలంతా షూటింగ్లో ఉంటూ, రాత్రి సీన్స్‌ను ఎడిట్ చేసేవారు. మళ్లీ వేరే సినిమా కోసం స్క్రిప్ట్ రాసుకునేవారు. అంత పనిచేస్తున్నా ఆయనలో అసలు స్ట్రెస్ కనిపించేది కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా దక్షిణాదిలో టాప్ డెరైక్టర్స్‌లో ఒకరిగా ఉన్నారంటే ఈ కష్టమే కారణం. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ప్రస్తుతం హిందీలో టైగర్ ష్రాఫ్‌తో ఓ సినిమా చేస్తున్నా. అది ఏప్రిల్‌లో విడుదలవుతుంది. ఇంకో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నా. -
'కంచె' మూవీ రివ్యూ
టైటిల్ : కంచె జానర్ ; పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం ; వరుణ్ తేజ్, ప్రగ్య జైస్వాల్, నికితిన్ ధీర్ దర్శకత్వం ; రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) సంగీతం ; చిరంతన్ భట్ సినిమాటోగ్రఫి ; గుణశేఖర్ వియస్ నిర్మాత ; సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. అతని దర్శకత్వంలో, మెగా వారసుడిగా భారీ మాస్ ఇమేజ్ ఉన్నా, ముకుందా లాంటి ఓ క్లాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పీరియాడికల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా కంచె. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన ప్రేమ కథ సన్నివేశాన్ని తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ సర్కిల్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వరుణ్‌తో పాటు క్రిష్‌కు కూడా ఓ భారీ కమర్షియల్ సక్సెస్ అవసరమైన సమయంలో చేసిన కంచె, ఈ ఇద్దరికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో రివ్యూలో చూద్దాం. కథ ; 1930 నాటి కథతో కంచె సినిమా మొదలవుతుంది. ధూపాటి హరిబాబు (వరుణ్ తేజ్) ఎంతో హుందా ఉండే మధ్య తరగతి అబ్బాయి. భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో శ్రద్దగా చదువుకుంటుంటాడు. అదే సమయంలో సమాజంలో జరిగే అన్యాయాలను చూసి సహించలేకపోతాడు. మనుషుల మధ్య దూరాలు పెరగటం ఎవరికి వారు కంచె వేసుకోని జీవించటం హరిబాబుకు నచ్చదు. అదే గ్రామంలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన సీతాదేవి (ప్రగ్యా జైస్వాల్) హరిబాబుతో ప్రేమలో పడుతుంది. అయితే అక్కడి సామాజిక పరిస్థితులు కొంత మంది వ్యక్తులు వారి ప్రేమకు అడ్డుపడతారు.ఇలాంటి పరిస్థితుల్లో హరిబాబు తన ప్రేమను గెలిపించుకున్నాడా..? అసలు హరిబాబు సైనికుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది.? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలి సినిమాతో పోలిస్తే వరుణ్ నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు రొమాంటిక్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించటంలో అతడు విజయం సాధించాడు. తొలి పరిచయం అయినా హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తన నటనతో మెప్పించింది. రెండు మూడు సీన్స్‌లో తప్ప పర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో మంచి మార్కులే సాధించింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన నికితిన్ ధీర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎంత బలమైన విలన్ ఉంటే హీరో అంత గొప్పగా కనిపిస్తాడు. అందుకే నికితిన్ తన నటనతో హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా తరువాత నికితిన్ టాలీవుడ్లో బిజీ విలన్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. కథను మలుపు తిప్పే పాత్రలో అవసరాల శ్రీనివాస్, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్, గొల్లపూడి మారుతిరావులు తమ పరిధి మేరకు అలరించారు. సాంకేతిక నిపుణులు : దర్శకుడిగా క్రిష్ గురించి కొత్తగా చెప్పకోవాల్సింది ఏమీలేదు. తన గత సినిమాల మాదిరిగానే, ఈ సినిమాలో కూడా హ్యమన్ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించాడు. ఇంత వరకు సౌత్ స్క్రీన్ మీద రాని ఓ కొత్త కథను ఎంచుకున్న క్రిష్, ఆ కథను వెండితెర మీద ఆవిష్కరించటంలో వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ఆర్ట్. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్. తొలిసారిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ కూడా పర్వాలేదనిపించాడు. ఈ సినిమాకు మరో ఇంపార్టెంట్ ఎసెట్ గుణశేఖర్ వియస్ సినిమాటోగ్రఫి, పీరియాడిక్ లుక్, వార్ ఎపిసోడ్స్ ను అద్బుతంగా తెరకెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : యుద్ధ సన్నివేశాలు వరుణ్, ప్రగ్యల నటన దర్శకత్వం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ స్క్రీన్ ప్లే ఓవరాల్‌గా 'కంచె' తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లే సక్సెస్ఫుల్ సినిమా -
ఆ గ్యాప్ వాడేసుకుంటున్నాడు
దసరా బరిలో భారీగా రిలీజ్ అవుతుందని భావించిన 'అఖిల్' సినిమా వాయిదా పడటంతో ఆ గ్యాప్‌ను వాడుకోవడానికి రెడీ అయ్యాడు మెగా హీరో వరుణ్ తేజ్. గమ్యం ఫేం క్రిష్ దర్శకత్వంలో వరుణ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' సినిమాను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ మేరకు తన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించినా... పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఆ తరువాత ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంలో ఎలాంటి ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. తాజాగా అక్టోబర్ 22న రిలీజ్ కావాల్సిన 'అఖిల్' వాయిదా వేస్తున్నట్టుగా నితిన్ ప్రకటించటంతో ఆ గ్యాప్ లో 'కంచె' రిలీజ్ చేస్తే పండుగ సెలవులను క్యాష్ చేసుకోవచ్చని, అదే రోజు రిలీజ్ ప్లాన్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే ప్రేమకథగా 'కంచె' సినిమాను తెరకెక్కించారు. సైనికుడిగా, ప్రేమికుడిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో వరుణ్ కనిపించనున్నాడు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. Kanche is all set to entertain you this Dusshera . October 22nd release!! pic.twitter.com/Dgc4FGI4pH — Varun Tej Konidela (@IAmVarunTej) October 16, 2015 -
'లోఫర్'కూ అదే స్ట్రాటజీ
తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత వేగంగా సినిమా చేసే ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. స్టార్ హీరోతో సినిమా అయినా కేవలం రెండు, మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేయటం పూరి స్టైల్. ఈ స్పీడ్ కొన్ని సందర్బాల్లో బాగానే ఉన్నా, క్వాలిటీ పరంగా మాత్రం కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి. అయితే ఇలాంటి అపవాదులు ఎన్ని వస్తున్నా, పూరి మాత్రం స్పీడు తగ్గించటం లేదు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' లో కూడా అదే ఫార్ములాను పూరి జగన్నాథ్ ఫాలో అయ్యాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావటానికి ముందే రిలీజ్ డేట్ ప్రకటించటంతో మరింత వేగంగా సినిమా చేయాల్సి వచ్చింది. ఇందుకోసం మేకింగ్‌లో ఓ డిఫరెంట్ స్టైల్‌ను ఫాలో అయ్యాడు. ఏ రోజు షూట్ చేసిన సన్నివేశాలను అదే రోజు ఎడిటింగ్ చేసి షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌ను కూడా ఒకేసారి పూర్తి చేశాడు. దీంతో అనుకున్న సమయానికి ఎలాంటి వాయిదాలు లేకుండా టెంపర్ రిలీజ్ చేయగలిగాడు. వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం తను చేస్తున్న 'లోఫర్' విషయంలోనూ పూరి అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకు సంబంధించిన కథ రెడీ చేయాల్సి ఉండటంతో, ప్రొడక్షన్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఒకేసారి ముగించేస్తున్నాడు. మరి ఈ వేగం పూరి ప్రాడక్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో తెలియాలంటే లోహర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
సంధ్యలో ‘ముకుంద’ టీమ్
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో బుధవారం విడుదలైన ‘ముకుంద’ సినిమాను ఆ చిత్ర బృందం వీక్షించింది. హీరో,హీరోయిన్ వరుణ్‌తేజ్, పూజా హెగ్డే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డా రాకతో అభిమానులు బాణ సంచా కాల్చి సందడి చేశారు. చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని వరుణ్‌తేజ్ చెప్పారు. - చిక్కడపల్లి