Varun Tejs Ghani Release Postponed To 2022 Summer - Sakshi
Sakshi News home page

‘గని’ విడుదలపై చిత్రబృందం క్లారిటీ

Published Sat, Dec 11 2021 8:54 AM | Last Updated on Sat, Dec 11 2021 9:55 AM

arun Tejs Ghani release postponed To  2022 Summer - Sakshi

వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. ఇందులో సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌. కాగా థియేట్రికల్‌ రిలీజ్‌ పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘గని’ కోసం ఎంతో కష్టపడ్డాం. క్లిష్టమైన లొకేషన్స్‌లో షూట్‌ చేశాం. ఖరీదైన సెట్స్‌ వేశాం. విజువల్‌గా ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇస్తుంది.

కరోనా పరిస్థితుల నుంచి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా చిత్రాలు రిలీజ్‌కి పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని, పోటీ వద్దనుకుని మా సినిమా రిలీజ్‌ను వాయిదా వేశాం. ‘గని’ చిత్రం థియేటర్స్‌లోనే వస్తుంది’’ అని శుక్రవారం చిత్రబృందం పేర్కొంది. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజవుతుందనే ప్రచారం సాగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement