కరోనా వల్ల పూర్తిగా చతికిలపడ్డ బాక్సాఫీస్ బిజినెస్ అఖండ, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 హిట్లతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాల సక్సెస్‌ను చూసి మరిన్ని చిత్రాలు రిలీజ్‌కు రెడీ అయ్యాయి. ప్రేక్షకుడికి బోలెడంత వినోదాన్ని పంచేందుకు సై అంటున్నాయి. అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలేంటో చూసేయండి..
జెర్సీ
షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన జెర్సీకి ఇది రీమేక్. తెలుగు జెర్సీని డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌కు సైతం దర్శకత్వం వహించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది.
1996 ధర్మపురి
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ సమర్పణలో గగన్ విహారి, అపర్ణ హీరోహరోయిన్లుగా నటించిన సినిమా 1996 ధర్మపురి. విశ్వజగత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 22న రిలీజవుతోంది.
ఆహా
గని - ఏప్రిల్ 22
అమెజాన్ ప్రైమ్
ఓ మై డాగ్ - ఏప్రిల్ 21
గిల్టీ మైండ్స్ - ఏప్రిల్ 22
జీ 5
అనంతం - ఏప్రిల్ 22
నెట్‌ఫ్లిక్స్
కుథిరైవాల్ - ఏప్రిల్ 20
ద మార్క్‌డ్ హార్ట్ - ఏప్రిల్ 20
హి ఈజ్ ఎక్స్‌పెక్టింగ్ (వెబ్‌సిరీస్) - ఏప్రిల్ 21
సోని లివ్
అంత్యాక్షరి - ఏప్రిల్ 22
వూట్
లండన్ ఫైల్స్ - ఏప్రిల్ 21
చదవండి: అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి
భారీ ఆఫర్‌ను తిరస్కరించిన బన్నీ!, ప్రశంసలు కురిపిస్తున్న ఫ్యాన్స్
Comments
Please login to add a commentAdd a comment