
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చాలా ఏళ్లుగా నేహా ఖేడ్కర్‌తో ప్రేమలో ఉన్న వరుణ్ తన దగ్గర ఏమీ లేనప్పుడు వరుణ్ వెంట నడిచిన నేహా

‘‘నన్ను నమ్మొద్దు. నాకు ఉద్యోగం లేదు. నన్ను మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది’’ అని నేహాకు చెప్పిన వరుణ్.

కానీ వరుణ్‌ని వదులుకునేందుకు ఇష్టపడని నేహా.

‘‘నువ్వు వెళ్లి క్రికెట్ ఆడు. ఐదు లేదా ఆరు వేలు సంపాదించు. నేనొక పదిహేను వేలు సంపాదిస్తున్నా కదా! ఇద్దరం కలిసి బతకడానికి ఈ మాత్రం చాలు’’ అంటూ వరుణ్‌కు అండగా నిలబడ్డ నేహా.

నిజమైన ప్రేమకు డబ్బు, హోదా అవసరం లేదని నమ్మి వరుణ్ వెంట నిలిచి.. అతడిలో ఆత్మవిశ్వాసం నింపి.. నేడు అతడు టీమిండియా స్టార్ స్పిన్నర్‌గా ఎదగడంలో నేహాది కీలక పాత్ర

ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనేందుకు వరుణ్- నేహాలు నిదర్శనం

2020లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు కుమారుడు ఆత్మన్ ఉన్నాడు.







