team india cricketer
-
మై క్రేజీ బేబీ: భార్యకు కేఎల్ రాహుల్ బర్త్‌డే విషెస్ (ఫొటోలు)
-
టీమిండియా స్టార్ అక్క.. ఈమె కూడా క్రికెటరే! (ఫొటోలు)
-
నరకప్రాయం.. నాకే ఎందుకిలా అనే భావన : ఊతప్ప
ఒకానొక దశలో తాను కూడా తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యానని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. నిరాశ నిస్పృహలో కూరుకుపోయి.. అసలు ఎందుకు బతికి ఉన్నానో తెలియని మానసిక స్థితిలోకి వెళ్లిపోయానన్నాడు. దాదాపు ఏడాది పాటు తన ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు కూడా భయపడిపోయానంటూ 2011 నాటి తన దుస్థితిని వివరించాడు.కాగా ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రాహమ్ థోర్ప్ ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, అతడిది సహజ మరణం కాదని.. బలవన్మరణానికి పాల్పడ్డాడని గ్రాహమ్ భార్య అమెండా వెల్లడించారు. ఒత్తిడిని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడంటూ ఉద్వేగానికి లోనయ్యారు.డిప్రెషన్.. నరకప్రాయం ఈ నేపథ్యంలో రాబిన్ ఊతప్ప తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. డిప్రెషన్, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో వివరించే ప్రయత్నం చేశాడు. కారణం లేకుండానే తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం నరకప్రాయంగా ఉంటుందని తెలిపాడు. అంతబాగానే ఉన్నా మనల్ని ప్రేమిస్తున్న వారికి భారంగా మారామనే ఆలోచన కుంగిపోయేలా చేస్తుందని వాపోయాడు.అయితే, ఇలాంటి సమయంలో బలహీనపడకుండా కాస్త స్థిమితంగా ఉంటే.. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు.. మనల్ని ప్రేమించే వాళ్లకూ గుండెకోత లేకుండా చేయగలమని ఊతప్ప పేర్కొన్నాడు. తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటూ.. ‘‘2011... అసలు నేను ఎందుకు మనిషి జన్మ ఎత్తానా? అనే భావనలో ఉండిపోయేవాడిని. నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా ఇష్టపడే వాడిని కాదు.అద్దం చూడలేదుఆ ఏడాదంతా అస్సలు అద్దం వైపే చూడలేదు. నా ఉనికి నా చుట్టూ ఉన్నవాళ్లకు భరించలేనిదిగా మారిందేమోనని సతమతమయ్యేవాడిని. నాకసలు విలువ లేదని అనిపించేది. నిస్సహాయత, నిరాశలో కూరుకుపోయాను. వారాలు.. నెలల.. సంవత్సరాల పాటు నా గదికే పరిమితమైతే బాగుంటుందని అనుకునేవాడిని.త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుందిఅయినా.. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బాధ ఒక్కరోజు ఉంటుందేమో!.. ఆ మరుసటి రోజు బాగుండవచ్చు కదా!.. మనం సాగుతున్న దారిలో చివరికంటా వెలుగు ఉండాలని ఆశించకూడదు. మరో అడుగు ముందుకు వేయడానికి దారి కనిపిస్తే చాలనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే.. గడ్డుకాలం ఎల్లకాలం ఉండదు. త్వరలోనే కష్టకాలం ముగిసిపోతుంది అని అనుకుంటూ ముందుకు సాగితే మంచిది’’ అని రాబిన్ ఊతప్ప ఒత్తిడిని అధిగమించే మార్గం కూడా చెప్పాడు. కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు.టీమిండియాలో రాని అవకాశాలుటీమిండియా తరఫున 46 వన్డేలు ఆడి 934, 13 టీ20లు ఆడి 249 పరుగులు చేసిన ఊతప్ప.. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్-2007 గెలిచిన భారత జట్టులో సభ్యుడు. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభించిన రెండేళ్లపాటు వరుస అవకాశాలు అందుకున్న ఈ కర్ణాటక క్రికెటర్.. 2009 నుంచి గడ్డుపరిస్థితులు ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు కరువుకాగా.. 2015లో భారత్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన ఊతప్ప రెండుసార్లు టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడు.చదవండి: ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్‌లో ఆడతా: స్మిత్ -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న యువరాజ్ సింగ్..?
టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయనున్నాడని భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. తాజాగా యువీ.. తల్లి షబ్నమ్తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలవడంతో ఈ ప్రచారం నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై యువీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం గురుదాస్‌పూర్ ఎంపీగా సినీ నటుడు సన్నీ డియోల్ ఉన్నాడు. ఇతను 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్దిగా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో మరో సినీ నటుడు కూడా ఎంపీగా గెలిచాడు. మునుపటి తరం బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్దిగా పలుమార్లు గెలిచాడు. 1998, 1999, 2004, 2014లో వినోద్ ఖన్నా గురుదాస్‌పూర్ ఎంపీగా గెలిచాడు. ఈ నియోజకవర్గం భారత్-పాకిస్తాన్ బోర్డర్‌ను ఆనుకుని ఉంటుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం. -
పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ : అంబటి రాయుడు
సాక్షి,అమరావతి: టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని టీమిండియా అంబటి తిరుపతి రాయుడు తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశి్నంచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంబటి రాయుడు అన్నారు. యువత ఆకాంక్షలకు అద్దం పడుతున్న రాయుడి అరంగేట్రం రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టం కట్టి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా యువతలో జగన్‌కు మద్దతు నానాటికీ అధికమవుతోంది. పలు సంస్కరణలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం.. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ భారీ ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుండడమే ఇందుకు నిదర్శనం. రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆయనకు వంతపాడుతున్న జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రధానంగా వారిద్దరి రాజకీయ వ్యవహారశైలిపై యువతలో అసహనం పెల్లుబికుతున్నది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. వైఎస్సార్సీపీలో చేరడం రాష్ట్రంలో యువత ఆకాంక్షలకు అద్దంపడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకక ముందు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికాక అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృ తంగా పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతుండడం.. ప్రధానంగా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండడాన్ని గమనించారు. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు యువత ఆకాంక్షలకు అద్దం పడుతూ.. వైఎస్సార్సీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే..
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా ఉన్నాడు. ఒకప్పుడు సచిన్, ధోనిలు చూసిన సంపద వైభోగాన్ని ఇప్పుడు కోహ్లి చూస్తున్నాడు. లెక్కలేనన్ని ఎండార్స్మెంట్లు, యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఆసియా ఖండంలో మాత్రం కోహ్లి రెండో ధనవంతమైన ఆటగాడిగా నిలిచాడని స్పోర్టికో అనే సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది. 2022 ఏడాదిలో రూ.277 కోట్లు సంపాదించిన కోహ్లి.. ఓవరాల్‌గా అత్యంత ధనవంతమైన ఆటగాళ్ల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్-100 లిస్ట్‌లో కోహ్లి మినహా ఏ క్రికెటర్ చోటు సంపాదించలేకపోయాడు. మరి ఆసియా ఖండం నుంచి టాప్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరని ఆరా తీస్తే జపాన్‌కు మహిలా టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అని తేలింది. 2022 ఏడాదిలో ఈ మాజీ యూఎస్ ఓపెన్ ఛాంపియన్ రూ. 434 కోట్లకు పైగా అర్జించినట్లు రిపోర్టులో వెల్లడించింది. రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే. ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ఎన్బీఏ స్టార్ లెబ్రన్ జేమ్స్ రూ.1037 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. లియోనల్ మెస్సీ రూ.997 కోట్లతో రెండో స్థానం, క్రిస్టియానో రొనాల్డో రూ. 939 కోట్లతో మూడో స్థానం, నెయ్మర్ రూ. 843 కోట్లతో నాలుగో స్థానం.. ఇక టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్ రూ.727 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. చదవండి: ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్‌ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
టీమిండియా క్రికెటర్‌కు తప్పిన పెను ప్రమాదం
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు వస్తుండగా ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు ప్రమాదానికి గురైంది. ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో ప్రవీణ్‌తోపాటు అతని కుమారుడు కారులో ఉన్నాడు. అయితే వీరిద్దరు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన వాహనం కారణంగా ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారు నుజ్జుగుజ్జయ్యింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్యాంటర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్ సిటీ ఎంట్రెన్స్‌లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రవీణ్ కుమార్ మీరట్‌లోని బాగ్పత్ రోడ్లో ఉన్న ముల్తాన్ నగర్లో నివాసం ఉంటాడు. 36 ఏళ్ల ప్రవీణ్ కుమార్ 2007-12 మధ్యలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ప్రవీణ్ ప్రధాన బౌలర్‌గా సత్తా చాటాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రవీణ్.. 68 వన్డేలు, 10 టీ20లు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 77, టీ20ల్లో 8, టెస్టుల్లో 27 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ప్రవీణ్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. 119 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన ప్రవీణ్ అడపాదడపా బ్యాట్‌తో కూడా రాణించాడు. వన్డేల్లో అతని పేరిట ఓ అర్ధసెంచరీ ఉంది. చదవండి: #RishabhPant: 'యాక్సిడెంట్ నాకు రెండో లైఫ్'.. 'డేట్ ఆఫ్ బర్త్' మార్చుకున్న పంత్ -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
క్రికెటర్ పృథ్వీ షాపై దాడి
-
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాపై దాడి
Prithvi Shaw Attacked: టీమిండియా అప్‌కమింగ్ క్రికెటర్ పృథ్వీ షాపై దాడి జరిగింది. షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్‌పై ముంబైలోని శాంటా క్రూజ్ ఫైవ్ స్టార్ హోటల్ ఆవరణలో పలువురు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో షా ప్రయాణిస్తున్న కారును దుండగులు బేస్‌బాల్ బ్యాట్లతో ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ సమీప ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. 8 మందిపై పలు సెక్షన్ల (143, 148,149, 384, 437, 504, 506) కింద కేసులు నమోదు చేశారు. షా స్నేహితుడు సురేంద్ర యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిబ్రవరి 15న పృథ్వీ షా.. సురేంద్ర యాదవ్‌తో పాటు పలువురు స్నేహితులతో కలిసి ముంబైలోని శాంటా క్రూజ్ హోటల్లో డిన్నర్ చేసేందుకు వెళ్లాడు. షా హోటల్ అవరణలోకి ప్రవేశించగానే నిందితుల్లో ఇద్దరు వచ్చి సెల్ఫీలు ఆడగ్గా షా వారితో కలిసి ఫోటోలు దిగి హోటల్‌లోనికి ప్రవేశించేందుకు ముందుకు కదిలాడు. ఈలోపు మరో ఇద్దరు వచ్చి సెల్ఫీ దిగాలని షాపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు షా ఒప్పుకోకపోవడంతో వారు అతన్ని దిగ్బంధించే ప్రయత్నం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న షా స్నేహితుడు హోటల్ యాజమాన్యానికి ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని వివరించగా.. మేనేజ్మెంట్ నిందితులను హోటల్ బయటకు గెంటేసింది. దీంతో కోపోద్రేక్తులైన నిందితులు హోటల్ బయట కాపు కాచి షా ప్రయాణిస్తున బీఎండబ్ల్యూ కారుపై బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన షా స్నేహితుడు.. అతన్ని మరో కారులోకి తరలించాడు. అయినప్పటికీ వదలని నిందితులు షా ప్రయాణిస్తున్న కారును ఛేజ్ చేసి లోటస్ పెట్రోల్ బంకు వద్ద మరోసారి అటకాయించారు. షా కారు వద్దకు ఓ యువతిని పంపిన నిందితులు 50000 నగదు ఇస్తే విషయాన్ని ఇక్కడితో వదిలేస్తామని.. లేకపోతే కేసులు పెడతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న షా నేరుగా ఓషివరా పీఎస్‌కు చేరుకున్నాడు. జరిగిన విషయంపై మాట్లాడేందుకు ఇష్టపడని షా స్నేహితుడితో పాటు కంప్లైంట్ ఇచ్చాడు. ఈ విషయం క్షణాల్లో దావణంలా వ్యాపించింది. ప్రస్తుతం షాపై దాడి జరిగిన విషయం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో దేశవాలీ టోర్నీల్లో పరగుల వరద పారించిన షా.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఎంపికయ్యాడు. అయితే అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. వాస్తవానికి షా టీ20ల్లో కాకుండా టెస్ట్‌ల్లో స్థానం దక్కుతుందని అశించాడు. అయితే తలా తోక సెలెక్టర్లు షాను టీ20 జట్టుకు ఎంపిక చేశారు. అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటిన షా.. ఆ తర్వాత కొన్ని టెస్ట్‌లకే ఫామ్ కోల్పోయి ఉద్వాసన గురయ్యాడు. #PrithviShaw https://t.co/EXqoU6AgJO pic.twitter.com/3UfmJCAYwO — Suraj Ojha (@surajojhaa) February 16, 2023 -
మాజీ భార్య పరువు తీస్తుంది.. టీమిండియా స్టార్ క్రికెటర్ ఆవేదన, కోర్టు అక్షింతలు
టీమిండియా స్టార్ క్రికెటర్, వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కోర్టు మెట్లెక్కాడు. అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ తన పరువుకు భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితులు, క్రికెట్‌కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో సహా కోర్టులో సమర్పించాడు. తన పరువుకు భంగం కలిగించే సమాచారాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తుందని వాపోయాడు. ధవన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు అయేషాను మందలించింది. ధవన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియాతో కానీ అతని స్నేహితులు, బంధువులతో కానీ మరే ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలపై కానీ షేర్ చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ధవన్ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నత వ్యక్తి అని, అంతేకాక అతను భారత క్రికెట్ జట్టులో కీలక సభ్యుడని, అతని రెప్యుటేషన్ దెబ్బతినే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. Delhi court restrains estranged wife of Shikhar Dhawan from making defamatory allegations against the cricketer report by @NarsiBenwal #ShikharDhawan @SDhawan25 https://t.co/5MWVV4gEUe — Bar & Bench (@barandbench) February 4, 2023 భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన అయేషా తన వాదనలను వినిపించేందుకు ఇది సరైన మార్గం కాదని, ఒకవేళ అలాంటివేవైనా ఉంటే రెండు దేశాల్లో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపింది. కాగా, ధవన్ 2012లో అస్ట్రేలియాకు చెందిన అయేషాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కుమారుడు (జోరావర్) జన్మించాడు. అయేషాకు ధవన్‌తో పెళ్లికి ముందే వివాహం జరిగింది. వారికి రియా, ఆలియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనస్పర్ధల కారణంగా ధవన్-అయేషా 2021లో విడిపోయారు. కోర్టు వీరికి విడాకులు కూడా మంజూరు చేసింది. కోర్టు తీర్పు మేరకు ధవన్ మెయింటెనెన్స్ సరిగ్గా చల్లించట్లేదని అయేషా ప్రస్తుతం ఆరోపిస్తుంది. కాగా, టీమిండియాలో కీలక సభ్యుడైన శిఖర్ ధవన్ ఇప్పటివరకు 34 టెస్ట్‌లు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. ఇందులో 2315 టెస్ట్ పరుగులు (7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు), 6793 వన్డే పరుగులు (17 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు), 1759 టీ20 పరుగులు (11 హాఫ్ సెంచరీలు) ఉన్నాయి. ధవన్ పలు మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. -
భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేశ్ యాదవ్‌ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్‌కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు.ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్‌ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇక 2011లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. 12 ఏళ్ల కెరీర్లో ఉమేశ్ యాదవ్ 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా' -
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజహార్ తండ్రి మహ్మద్ యూసఫ్ ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. యూసఫ్.. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
రియల్ హీరోగా మారిన హర్భజన్
గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించి, నిత్యం దూకుడుగా కనిపించే టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రియల్ లైఫ్‌లోనూ అదే తరహాలో మోసగాళ్లకు చుక్కలు చూపించి, వారి చెరలో నుంచి ఓ అమాయక యువతికి విముక్తి కల్పించాడు. ప్రస్తుతం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న భజ్జీ.. గల్ఫ్‌లో మోసగాళ్ల చెరలో చిక్కుకున్న ఓ యువతిని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని భటిండా ప్రాంతానికి చెందిన కమల్జీత్ అనే 21 ఏళ్ల యువతి ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన ఓమన్కు వెళ్లాలనుకుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ ఏజెంట్‌ను కలిసి వీసా తదితర ఏర్పాట్లు చేయాలని కొరింది. కమల్జీత్ అవసరాన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఏజెంట్.. ఆమెకు మాయమాటలు చెప్పి గత నెలలో మస్కట్‌కు పంపించాడు. మస్కట్‌లో ఓ హిందూ కుటుంబానికి వంట చేసే పని ఉందని.. మంచి జీతం, వసతి ఉంటాయని కల్లబొల్లి కబుర్లు చెప్పాడు. అయితే ఏజెంట్ చెప్పినవేవీ అక్కడ జరగకపోవడంతో కమల్జీత్ మోసపోయానని తెలుసుకుంది. కమల్జీత్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి పాస్ పోర్ట్, సిమ్ కార్డ్ లాక్కొని ఆమెను ఓ గదిలో బంధించాడు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని బయట పడిన కమల్జీత్ తండ్రికి ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించింది. కమల్జీత్ తండ్రి విషయం తెలిసిన వెంటనే తెలిసిన వ్యక్తుల ద్వారా స్థానిక ఎంపీ హర్భజన్‌ను కలిశాడు. జరిగినదంతా భజ్జీకి వివరించాడు. ఇది విని చలించిపోయిన భజ్జీ వెంటనే మస్కట్‌లోని భారత ఎంబసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశాడు. దీంతో ఎంబసీ అధికారులు రంగంలోకి దిగి కమల్జీత్కు మోసగాళ్ల చెర నుంచి విముక్తి కల్పించి సురక్షితంగా భారత్‌కు పంపించారు. దీంతో కమల్జీత్, ఆమె కుటుంబసభ్యులు హర్భజన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మీరు గ్రౌండ్లోనూ, రియల్ లైఫ్‌లోనూ హీరోలు అంటూ కొనియాడారు. చదవండి: పసికూనలు చెలరేగుతున్న వేళ, టీమిండియాకు ఎందుకీ దుస్థితి..? -
నీటికి కటకట.. భారత ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు
కేఎల్ రాహుల్ సారధ్యంలోని టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లకు ఒక విషయమై బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జింబాబ్వేలో నీటి సంక్షోభం తారాస్థాయిలో ఉంది. గుక్కెడు మంచినీళ్ల కోసం అక్కడి ప్రజలు ట్యాంకర్లు, ప్రభుత్వ నల్లాల ఎదుట బారులు తీరుతున్నారు. కొందరు షాపుల్లో దొరికే వాటర్ బాటిళ్లను కొనుక్కొని తాగడానికి.. వంటకు వాడుతున్నారు. ముఖ్యంగా వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న ఆ దేశ రాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా కరువు ఛాయలతో కొట్టుమిట్టాడుతున్న జింబాబ్వేలో ప్రతి ఏడాదీ ఈ సీజన్లో నీటి కొరత సర్వసాధారణం. 2019లో అయితే అక్కడి ప్రజలకు తాగునీరు లేక కలుషితమైన నీటినే తాగాల్సి వచ్చినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈసారి కూడా నీటిని శుద్ది చేసే యంత్రాలు పాడవడంతో ప్రజలు తాగునీటికి ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు కీలక సూచన చేసింది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడారు. ‘జింబాబ్వేలో నీటి కొరత ఉంది. వన్డే సిరీస్ జరగాల్సి ఉన్న హరారేలో ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. దీంతో మేం క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడానలి సూచించాం. తక్కువ సమయంలో స్నానాలు, ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు చెప్పాం. నీటి కొరత కారణంగా స్విమ్మింగ్ పూల్స్ లో జలకాలాటలు వంటివి అన్ని రద్దు చేశాం.’అని తెలిపాడు. టీమిండియాకు విదేశీ పర్యటనలలో ఇలా నీటి కొరత ఎదురువడం ఇది తొలిసారి కాదు. గతంలో 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లినప్పుడూ ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు.. తాము ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని ఒక భారత క్రికెటర్ పేర్కొన్నాడు. 📍Harare , Mabelreighn Water pic.twitter.com/S3gr87I3uI — Alexander Gusha ❁ (@ZEZURUROCKSTAR) August 15, 2022 1/ Harare West in particular & other parts of Harare have had no running water for the past 3 weeks. This is a clear violation of section 77 of the constitution of Zimbabwe which enshrines the right to safe, clean & potable water. Water is life, the unavailability of it,... — Linda Tsungirirai Masarira (@lilomatic) August 15, 2022 చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం.. సెలక్టర్ల వల్లే! -
సెంచరీ చేయకపోతేనేం.. అతనిప్పటికీ రన్ మెషీనే..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫామ్‌లో లేడని, సెంచరీ సాధించి దాదాపు 1000 రోజులవుతందని నానా యాగీ చేస్తున్న వారికి ఈ గణాంకాలు చెంప పెట్టేనని చెప్పాలి. 2020 నుంచి మూడు ఫార్మాట్లలో కోహ్లి సాధించినన్ని పరుగులు ఏ ఇతర భారత బ్యాటర్ చేయలేదన్నది కాదనలేని సత్యం. కోహ్లి సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా.. అతని ప్రదర్శన మాత్రం ఏమంత తీసికట్టుగా లేదనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష సాక్ష్యం. 2020 నుంచి 2022 ఇంగ్లండ్ సిరీస్ వరకు మూడు ఫార్మాట్లలో 79 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి సెంచరీ మార్కు ఒక్కసారి కూడా అందుకోనప్పటికీ 34.95 సగటున 2237 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. కోహ్లి తర్వాత ఇటీవలే విండీస్ ఓపెనర్ షై హోప్ (22) ఈ మధ్యకాలంలో ఇన్ని అర్ధసెంచరీలు సాధించాడు. View this post on Instagram A post shared by Indian Express Sports (@iexpresssports) ఈ మధ్యకాలంలో కోహ్లి మినహా మరే ఇతర భారత క్రికెటర్ ఇన్ని పరుగులు చేయలేదు. ఓవరాల్‌గా చూసినా 2020 తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి 7వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 3508 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (3099) రెండో స్థానంలో, బంగ్లా ఆటగాడు లిటన్ దాస్ (2754), పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ (2656), ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిన్‌స్టో (2609), సఫారీ ప్లేయర్ డస్సెన్ (2244)లు వరుసగా 3 నుంచి ఆరు స్థానాల్లో నిలిచారు. కోహ్లి తర్వాత టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ (2097), కెప్టెన్ రోహిత్ శర్మ (2039) 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగా చూస్తే కోహ్లి ఫామ్ సహచర టీమిండియా ఆటగాళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉందనే చెప్పాలి. సెంచరీ చేయలేకపోతున్నాడన్న లోటు తప్పిస్తే కోహ్లి ప్రదర్శన పర్వాలేదని అనాలి. విమర్శకులు, విశ్లేషకులు, ఫ్యాన్స్ ఒత్తిడి అధికమై మూడంకెల స్కోర్ సాధించలేకపోతున్నాడే తప్పా.. కోహ్లికి ఉన్న సత్తాకు సెంచరీ సాధించడం ఏమంత విషయం కాదనే చెప్పాలి. ఈ గణాంకాలు చూసిన కోహ్లి అభిమానులు తమ బాస్ ఇప్పటికీ రన్మెషీనేనని.. త్వరలో జరుగబోయే జింబాబ్వే సిరీస్‌లో 71వ సెంచరీ సాధించి విమర్శకుల నోళ్లు మూయిస్తాడని ఛాలెంజ్ చేస్తున్నారు. చదవండి: అనుష్కతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన కోహ్లి.. చాలా సంతోషం.. ఫొటో వైరల్ -
దినేశ్ కార్తిక్.. ఫెయిల్యూర్ మ్యారేజ్ టూ సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ
టీమిండియా వెటరన్ క్రికెటర్.. ఆర్సీబీ స్టార్ ఆటగాడు దినేశ్ కార్తిక్ ఇవాళ(జూన్ 1న) 37వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. టీమిండియాలోకి(2004) చాలాకాలం క్రితమే ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఎంఎస్ ధోని హయాంలో కార్తిక్ ఆడడం అతని దురదృష్టం అని చెప్పొచ్చు. దాదాపు ధోని, దినేశ్ కార్తిక్‌లు టీమిండియాలోకి ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అయితే వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా.. టీమిండియా కెప్టెన్‌గా అసమాన రీతిలో వెలిగిపోయిన ధోనికి వెనకాల కార్తిక్ చీకటిలో మిగిలిపోయాడు. మధ్య మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి పెద్దగా రాణించలేకపోయాడు. అలా అని కార్తిక్ ఆటతీరును తీసిపారేయల్సినంతగా ఎప్పుడు అనిపించలేదు. ధోని నీడలోనే ఎక్కువకాలం ఆడిన దినేశ్ కార్తిక్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది మాత్రం 2018 నిదహాస్ ట్రోపీ. ట్రై సిరీస్ ఫార్మాట్లో జరిగిన టోర్నీకి రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని దూరంగా ఉన్నాడు. దీంతో కార్తిక్‌కు తుది జట్టులో అవకాశం వచ్చింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన టీమిండియాను తన నాకౌట్ ఇన్నింగ్స్‌తో గెలిపించడమే గాక టైటిల్ అందించాడు. 2 ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన దశలో కార్తిక్ 8 బంతుల్లోనే 29 పరుగులు బాదాడు. చివరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో కార్తిక్ భారీ సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ ఆటగాళ్ల కలను నెరవేరకుండా చేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే 2004లో అరంగేట్రం చేసిన దినేశ్ కార్తిక్ టీమిండియా తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 38 టి20లు ఆడాడు. ఇటీవలే ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరపున సూపర్ ఫినిషర్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్లో దినేశ్ కార్తిక్ 16 మ్యాచ్‌లాడి 330 పరుగులు సాధించాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆఖరున వచ్చిన కార్తిక్ ఎవరు ఊహించని రీతిలో సూపర్ ఫినిషర్‌గా మారాడు. 37 ఏళ్ల వయసులోనూ అదరగొట్టే స్ట్రైక్‌రేట్‌తో మెరిసిన కార్తిక్‌ను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు వరించింది. ఇక జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్‌కు ఎంపికైన కార్తిక్ రాణించాలని కోరుకుంటూ.. ''హ్యాపీ బర్త్‌డే దినేశ్ కార్తిక్'' వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు క్రికెట్ కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న దినేశ్ కార్తిక్ వ్యక్తిగత జీవితంలోనూ అదే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒక ఫెయిల్యూర్ మ్యారేజ్ నుంచి సక్సెస్ఫుల్ లవ్‌స్టోరీ వరకు కార్తిక్ జర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. 2007లో నికితా వంజరను వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతో కార్తిక్ బంధం కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. మరో టీమిండియా మాసీ క్రికెటర్ మురళీ విజయ్‌తో నిఖితాకు ఉన్న లవ్ అఫైర్ కార్తిక్‌ను డైవర్స్ తీసుకునేలా చేసింది. 2012లో నికితా నుంచి విడాకులు తీసుకున్న కార్తిక్ జీవితంలోకి భారత స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ ఎంట్రీ ఇచ్చింది. 2013లో వీరిద్దరి మధ్య ఆసక్తికర రీతిలో ప్రేమ చిగురించింది. ఆ సంవత్సరం స్క్వాష్ క్రీడలో మరింత పదును పెంచుకునేందుకు దీపికా పల్లికల్ ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు వచ్చింది. అదే సమయంలో దినేశ్ కార్తిక్ కూడా టీమిండియాతో కలిసి టెస్టు మ్యాచ్ ఆడేందుకు లీడ్స్‌కు వచ్చాడు. అక్కడ తొలిసారి దీపికను చూసిన కార్తిక్ తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు. ఆమెపై ఇష్టంతో ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చి స్క్వాష్ గేమ్ ఆడేవాడు. అలా ప్రేమ బంధంలో మునిగిపోయిన ఈ జంట 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా ఇటీవలే దినేశ్ కార్తిక్ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు కవలలకు తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా కబీర్ పల్లికల్ కార్తిక్, జియాన్ పల్లికల్ కార్తిక్ అని పేర్లు పెట్టారు. ప్రస్తుతం కార్తిక్, దీపికా పల్లికల్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. చదవండి: Dinesh Karthik: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ -
భార్యను ఒప్పించి రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బెంగాల్ రంజీ జట్టు హెడ్ కోచ్ అరుణ్ లాల్ 66 ఏళ్ల లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అనారోగ్యంగా ఉన్న మొదటి భార్యను ఒప్పించి మరీ ఆయన ఈ కార్యానికి రెడీ అయ్యాడు. అరుణ్ లాల్.. తనకు చాలాకాలంగా పరిచయమున్న బుల్ బుల్ సాహ (బెంగాల్) అనే మహిళ (38)ను మే 2న మనువాడబోతున్నాడు. కోల్‌కతాలోని పీర్లెస్ ఇన్‌లో వీరి వివాహం జరుగనుంది. ఈ మేరకు అరుణ్ లాల్ ఇప్పటికే తనకు కావాల్సి వారికి ఆహ్వానం పంపాడు. Arun Lal shared the invitation for his second marriage with his long-time friend Bul Bul Saha on May 2nd, 2022 Congratulations Arun Lal #Cricket pic.twitter.com/CEybHsJDN1 — All About Cricket (@AllAboutCricke8) April 24, 2022 అరుణ్ లాల్.. అనారోగ్యంతో బాధపడుతున్న తన మొదటి భార్య రీనాకు చాలాకాలం క్రితమే విడాకులు ఇచ్చాడు. విడాకులు తీసుకున్నా మంచానికే పరిమితం కావడంతో ఆమె అరుణ్ లాల్‌తోనే జీవిస్తుంది. రీనాకు అరుణ్ లాల్ మనువాడబోయే బుల్ బుల్‌తో కూడా సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అరుణ్ లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా అరుణ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాల సాయంతో 10421 పరుగులు సాధించాడు. చదవండి: PBKS VS CSK: నాలుగు భారీ రికార్డులపై కన్నేసిన శిఖర్ ధవన్ -
'ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి'
-
'ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి'
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా స్టార్ పేసర్‌గా ఎదుగుతున్నాడు. 2017లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సిరాజ్ మొదట్లో జట్టులోకి వస్తూ.. పోతూ ఉండేవాడు. గత ఏడాది కాలంగా అన్ని ఫార్మాట్లలోనే రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగుతూ కీలకంగా మారుతున్నాడు. ఇక ఐపీఎల్లో సిరాజ్.. ఆర్సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోహ్లి, మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ సిరాజ్‌పై ఉన్న నమ్మకంతో తమ వద్దే అట్టిపెట్టుకుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సిరాజ్ ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌కు చిన్న ఇంటర్య్వూ ఇచ్చాడు. క్రికెట్లో తన అడుగు ఎలా పడిందనేది మహ్మద్ సిరాజ్ ఆసక్తికరంగా వివరించాడు. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' ''నా కెరీర్ విషయమై అమ్మ, నాన్న ఎప్పుడు గొడవపడుతుండేవారు. నేను జాబ్ చేయాలా లేక చదువుకోవాలా అనే దానిపై రోజు పెద్ద చర్చ నడిచేది. కానీ నాకు ధ్యాసంతా క్రికెట్‌పైనే.. చదవడం, జాబ్ చేయడం ఇష్టం లేదు. ఈ విషయం అమ్మానాన్నకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఆ సమయంలో మా మామయ్య నాకు సహకరించాడు. ఒకరోజు గొడవ జరుగుతున్న సందర్భంలో మామయ్య ఇంటికి వచ్చాడు. అతనికి ఒక క్రికెట్ క్లబ్ ఉంది. మావాళ్లు చెప్పిందంతా విన్న మామయ్య.. వాడిని(సిరాజ్) క్లబ్‌కు తీసుకెళుతాను. అక్కడికి వచ్చి సిరాజ్ క్రికెట్ ఆడతాడు.. ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం అన్నాడు. నేను సరే అని ఒప్పుకున్నా. ఆడిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశా. నా ప్రదర్శన చూసిన మామయ్య ఆశ్చర్యపోయి.. ఇంత బాగా ఆడతావని ఊహించలేదన్నాడు. వెంటనే నాన్నకు ఫోన్ చేసి.. వాడిని చదవమని.. జాబ్ చేయమని బలవంతం చేయొద్దు.. నచ్చింది చేయనివ్వండి. సిరాజ్‌కు అండగా నేనుంటా.. ఖర్చులన్నీ భరిస్తా అని చెప్పి ఐదు వందలు రూపాయలు నా చేతిలో పెట్టాడు. బహుశా అదే నా తొలి సంపాదన అనుకుంటా. అందులో మూడు వందలు నా కుటుంబానికి ఇచ్చి.. మిగతా రెండు వందల రూపాయాలు నా దగ్గరే పెట్టుకున్నా. ఒక రకంగా నేను క్రికెట్లో అడుగుపెట్టడానికి మామయ్య పరోక్షంగా కారణం అయితే.. ప్రత్యక్షంగా ఆ 9 వికెట్లు ఉంటాయి. నిజానికి ఆ తొమ్మిది వికెట్లు నా తలరాతను మార్చాయి.. లేకుంటే ఈరోజు ప్రపంచస్థాయి బౌలర్‌ను మీరు చూసి ఉండరు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సిరాజ్ టీమిండియా తరపున 4 టెస్టులు, 2 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్లో 50 మ్యాచ్‌ల్లో 50 వికెట్లు తీశాడు. చదవండి: Ravichandran Ashwin: 'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్ Womens World Cup 2022: టాయిలెట్లో చిక్కుకుపోయిన మహిళా క్రికెటర్.. మ్యాచ్ కోసం The RCB Podcast: Mohammed Siraj’s rise to stardom@mdsirajofficial talks about his earliest memory of playing cricket, struggling years trying to make it big in the world of cricket, and plenty of other anecdotes in the #RCBPodcast powered by @KotakBankLtd. #PlayBold pic.twitter.com/t12VHUXHB2 — Royal Challengers Bangalore (@RCBTweets) March 1, 2022 -
టీమిండియా క్రికెటర్‌పై చేయి చేసుకున్న పెద్దాయన..
Shikhar Dhawan Slapped By His Father: ఓ వ్యక్తితో ప్రాంక్ చేయబోయి, టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ చెంప దెబ్బ తిన్నాడు. ఇదేదో నిజంగా జరిగిందనుకుంటే పొరపాటే. ఓ ఫన్నీ వీడియో మేకింగ్‌లో భాగంగా తండ్రి, కొడుకుల మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ గదిలో నుంచి బయటకు వస్తున్న తండ్రిని.. వారెంట్ ఉందా, సాక్షం ఉందా అంటూ ప్రశించడంతో చిర్రెత్తిపోయిన ఆ పెద్దాయన లోపలికి పో అంటూ ధవన్ చెంప చెల్లుమనిపిస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను ధవన్.. తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "బాప్ హమేశా బాప్ హీ హోతా హై" అంటూ క్యాప్షన్ జోడించాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) ఈ వీడియోకు నిమిషాల వ్యవధిలో లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఇందులో ధవన్ న్యాచురల్‌గా కనిపించడంతో పెద్దాయన సీరియస్‌గానే చేయి చేసుకున్నాడని వీక్షకులు అపోహ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. గబ్బర్ యాక్టింగ్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్.. గబ్బర్ యాక్టింగ్‌ను ఆకాశానికెత్తారు. ధవన్ టాలెంట్ చూసి బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఫిదా అయ్యాడు. కాగా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో గబ్బర్ రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లి, రోహిత్‌ల ర్యాంకులు పదిలం.. దూసుకొచ్చిన డికాక్, డస్సెన్ -
'తగ్గేదేలే' డైలాగ్‌తో అదరగొట్టిన టీమిండియా ఓపెనర్
యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో గతకొంత కాలంగా బెంచ్‌కే పరిమితమైన టీమిండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధవన్ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. రకరకాల ఫన్నీ మీమ్స్‌తో పాటు డ్యాన్స్‌లు, హిట్ సినిమాల్లోని పాపులర్ డైలాగ్‌లతో నెట్టింట హల్చల్ చేస్తున్నాడు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లోని సూపర్ హిట్ డైలాగ్‌ను హిందీలో చెప్పి బన్నీ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. తగ్గేదేలే అంటూ బల్ల బద్ధలు కొట్టాడు. పుష్ప... పుష్పరాజ్... మై ఝుకేగా నై(తగ్గేదేలే) అంటూ అదిరిపోయే రేంజ్లో హావభావాలు పలికించాడు. View this post on Instagram A post shared by Shikhar Dhawan (@shikhardofficial) తమ అభిమాన హీరో పవర్ఫుల్ డైలాగ్‌ని గబ్బర్ అదిపోయే రేంజ్లో చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గబ్బర్ను ప్రశంసలతో ముంచెత్తుతూ, త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కోసం ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే, జనవరి 19 నుంచి ప్రారంభంకానున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ధవన్ చోటు దక్కించుకున్నాడు. ధవన్ చివరిసారిగా గతేడాది శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు నాయకత్వం వహించాడు. చదవండి: IND Vs SA 3rd Test: ద్రవిడ్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లి -
పాడు వైరస్.. తాతను తీసుకెళ్లిపోయింది: క్రికెటర్ భావోద్వేగం
చెన్నై: టీమిండియా టెస్టు ఓపెనర్ అభినవ్ ముకుంద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అభినవ్ ముకుంద్ తాత టీ. సుబ్బారావు(95) కరోనాతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అభినవ్ ముకుంద్ తన ట్విటర్లో పేర్కొన్నాడు. ''ఈరోజు నా జీవితంలో చీకటిరోజు. నాకు ఎంతో ఇష్టమైన మా తాత టీ. సుబ్బారావు ఈరోజు కరోనాతో పోరాడుతూ కన్నుమూశారు. 95 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న మా తాతను పాడు వైరస్ మా తాతను తీసుకెళ్లిపోయింది. ఆయన మాతో ఉన్నన్నాళ్లు అందరం క్రమశిక్షణతో మెలిగేవాళ్లం.. నేడు భౌతికంగా దూరమయ్యారంటే తట్టుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి ఓం శాంతి అంటూ భావోద్వేగంతో తెలిపాడు. కాగా కరోనా సెకండ్‌వేవ్‌లో చాలా మంది క్రికెటర్లు తమ ఆప్తులను కోల్పోతున్నారు. పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్ తండ్రులు కరోనాతో మృతి చెందగా.. టీమిండియా మహిళా క్రికెటర్ల వేదా కృష్ణమూర్తి తన సోదరిని, తల్లిని కోల్పోగా.. మరో క్రికెటర్ ప్రియా పూనియా తల్లి కరోనా కాటుకు బలయ్యారు. ఇక తమిళనాడుకు చెందిన అభినవ్ ముకుంద్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున ఏడు టెస్టలాడిన ముకుంద్ 320 పరుగులు చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన ముకుంద్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. నాలుగేళ్ల క్రితమే టీమిండియాకు దూరమైన అభినవ్ దేశవాలీ టోర్నీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు 145 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 10వేలకు పైగా పరుగులు సాధించాడు. 2008లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 300 పరుగులు సాధించి తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ టీమిండియా మహిళా క్రికెటర్ ఇంట్లో విషాదం With great sadness, i would like to inform you all that i have lost my grandfather Mr. TK Subbarao to CoVid19. He was 95. A man known for his discipline and his exemplary routines,was otherwise hale and healthy till the virus took him away. Om Shanti! — Abhinav mukund (@mukundabhinav) May 20, 2021 -
సంతోషించేలోపే.. టీమిండియా క్రికెటర్‌కి షాక్!
కోల్‌కతా : లైంగిక ఆరోపణలు, గృహ హింస చట్టం కేసులతో భర్త, టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీని ఉక్కిరి బిక్కిరి చేసిన హసీన్ జహాన్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. దీంతో టీమిండియా క్రికెటర్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. భార్య హసీన్ జహాన్ చేసిన ఫిర్యాదుతో షమీకి కోల్‌కతా అలీపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని క్రికెటర్‌ను ఆదేశించింది. భార్య ఫిర్యాదు అనంతరం గత మార్చి నెలలో షమీ లక్ష రూపాయల చెక్కును ఇచ్చాడు. తనకు షమీ ఇచ్చిన లక్ష రూపాయల చెక్ (నెంబర్ 03718) బౌన్స్ అయిందని హసీన్ జహాన్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అలీపూర్ కోర్ట్ సెప్టెంబర్ 20న విచారణకు హాజరు కావాలని క్రికెటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, నెలకు తనకు రూ.10 లక్షల భరణం ఇవ్వాలని షమీని భార్య డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కుటుంబ పోషణకు 7లక్షల రూపాయలు, తమ పాప కోసం 3 లక్షలు ఇవ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. తన బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం భార్య ఎప్పుడో ఖాళీ చేసిందని ఆరోపించిన షమీ.. ఈ నేపథ్యంలో ఇచ్చిన లక్ష రూపాయల చెక్ బౌన్స్ వ్యవహారం షమీకి తలనొప్పిగా మారింది. మరోవైపు ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో పేసర్ షమీకి బీసీసీఐ చోటిచ్చింది. ఇటీవల నిర్వహించిన యోయో టెస్టులో విఫలమవడంతో ఇంగ్లండ్, ఐర్లాండ్‌లతో జరిగిన పొట్టి ఫార్మాట్ సిరీస్‌లకు దూరమైన షమీకి అలా గుడ్ న్యూస్ తెలిసి సంతోషించేలోపే.. ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది. గతంలోనూ భార్య ఆరోపణల నేపథ్యంలో షమీకి బీసీసీఐ తొలుత ఆటగాళ్ల కాంట్రాక్ట్ ఇవ్వలేదు. ప్రాథమిక విచారణ అనంతరం షమీకి క్లీన్చిట్ రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో, భారత జట్టులో ఆడేందుకు పర్మిషన్ లభించింది. -
పాకిస్థానీ మహిళకు క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు
భారతదేశం తరఫున ఆడటం.. ఆ జెర్సీ ధరించి వెళ్లడం అంటేనే గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. సరిగ్గా ఇదే విషయంలో ఓ పాకిస్థానీ మహిళ అడిగిన ప్రశ్నకు భారతీయ క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు. ముస్లిం అయి ఉండి భారతదేశం తరఫున ఎందుకు ఆడుతున్నావని ఇర్ఫాన్ పఠాన్‌ను ఓ పాకిస్థానీ మహిళ ప్రశ్నించింది. దానికి ''భారతదేశం తరఫున ఆడటం నాకు గర్వకారణం'' అని సమాధానం ఇచ్చాడు. అప్పట్లో పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో ఇర్ఫాన్ కూడా సభ్యుడు. బరోడాకు చెందిన ఈ ఆల్‌రౌండర్ అలనాటి ఈ ముచ్చటను ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకున్నాడు. చిట్టచివరిసారిగా 2012 అక్టోబర్ నెలలో పఠాన్ ఒక టి20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ఆడాడు. పాకిస్థానీ మహిళతో మాట్లాడిన తర్వాత తన కెరీర్ మరింత మెరుగ్గా ఉందని చెప్పాడు. మళ్లీ జట్టులోకి రావడం మాత్రం అంత సులభం కాదని ఇర్ఫాన్ అంటున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోనీ జట్టయిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ ఆడుతున్నాడు. చాలాకాలంగా దూరంగా ఉన్నా, మళ్లీ ఎప్పటికైనా భారత జెర్సీ వేసుకోకపోతానా అనే ఆశ మాత్రం ఇర్ఫాన్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, టి20లు ఆడాడు. మొట్టమొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ చేసిన ఏకైక అంతర్జాతీయ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. 2006లో కరాచీలో పాకిస్థాన్ మీద జరిగిన టెస్టులో అతడు ఈ ఫీట్ సాధించాడు.