Shikhar Dhawan Funny Video With His Father, Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Shikhar Dhawan: ప్రాంక్‌ చేయబోగా, శిఖర్‌ ధవన్‌పై చేయి చేసుకున్న పెద్దాయన..!

Published Wed, Jan 26 2022 8:07 PM | Last Updated on Thu, Jan 27 2022 9:10 AM

Shikhar Dhawan Funny Video With His Father Gone Viral - Sakshi

Shikhar Dhawan Slapped By His Father: ఓ వ్యక్తితో ప్రాంక్‌ చేయబోయి, టీమిండియా స్టార్ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్ చెంప దెబ్బ తిన్నాడు. ఇదేదో నిజంగా జరిగిందనుకుంటే పొరపాటే. ఓ ఫన్నీ వీడియో మేకింగ్‌లో భాగంగా తండ్రి, కొడుకుల మధ్య జరిగిన సంభాషణ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ గదిలో నుంచి బయటకు వస్తున్న తండ్రిని.. వారెంట్‌ ఉందా, సాక్షం ఉందా అంటూ ప్రశించడంతో చిర్రెత్తిపోయిన ఆ పెద్దాయన లోపలికి పో అంటూ ధవన్‌ చెంప చెల్లుమనిపిస్తాడు. దీనికి సంబంధించిన వీడియోను ధవన్‌.. తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. "బాప్‌ హమేశా బాప్‌ హీ హోతా హై" అంటూ క్యాప్షన్‌ జోడించాడు. 

ఈ వీడియోకు నిమిషాల వ్యవధిలో లక్షల సంఖ్యలో వ్యూస్‌ వచ్చాయి. ఇందులో ధవన్‌ న్యాచురల్‌గా కనిపించడంతో పెద్దాయన సీరియస్‌గానే చేయి చేసుకున్నాడని వీక్షకులు అపోహ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. గబ్బర్‌ యాక్టింగ్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌.. గబ్బర్‌ యాక్టింగ్‌ను ఆకాశానికెత్తారు. ధవన్‌ టాలెంట్‌ చూసి బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ఫిదా అయ్యాడు. కాగా, తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో గబ్బర్‌ రెండు హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. 
చదవండి: కోహ్లి, రోహిత్‌ల ర్యాంకులు పదిలం.. దూసుకొచ్చిన డికాక్‌, డస్సెన్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement