సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్స్‌లో కఠోరంగా సాధన చేస్తుంది. ఆటగాళ్లంతా తమలోని టాలెంట్‌కు సాన పెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు. విరాట్ కోహ్లి అందరికంటే కాస్త ఎక్కువ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఇందులో విరాట్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ కనిపించాడు. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్ అతను కొట్టిన ఓ భారీ సిక్సర్ జనాలను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. విరాట్ మ్యాచ్‌లోనూ ఇదే టచ్‌ను కొనసాగిస్తే సెంచరీ చేయడం ఖాయమని అతని ఫ్యాన్స్ అంటున్నారు.
విరాట్ పేసర్లను సైతం చాలా కాన్ఫిడెంట్‌గా ఎదుర్కొన్నాడు. సౌతాఫ్రికా ప్రధాన అస్త్రాలు పేసర్లే కావడంతో విరాట్ ఈ విభాగంపై కాస్త శ్రద్ద ఎక్కువ పెట్టాడు. తొలి టెస్ట్‌లో సైతం పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విరాట్.. నిర్ణయాత్మకమైన రెండో మ్యాచ్‌లో వారి భరతం పట్టాలని కంకణం కట్టుకున్నట్లున్నాడు. తొలి టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆడిన ఇన్నింగ్స్ తర్వాత విరాట్‌పై అంచనాలు ఇంకాస్త పెరిగాయి. సిరీస్ కాపాడుకోవాలంటే రెండో టెస్ట్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండటంతో విరాట్ సహా అందరూ కఠోర సాధనలో నిమగ్నమై ఉన్నారు.
Virat Kohli smashing sixes in the practice session. [Kushan Sarkar/PTI] pic.twitter.com/AQZOa6JgKj
— Johns. (@CricCrazyJohns) January 1, 2024
రెండ్రోజుల కిందటే మ్యాచ్‌కు వేదిక అయిన కేప్‌టౌన్‌కు చేరుకున్న టీమిండియా.. అక్కడి వాతావరణ పరిస్థితులకు కూడా అలవాటు పడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్ 1-1తో డ్రా అవుతుంది. రెండో టెస్ట్ జనవరి 3 నుంచి ప్రారంభంకానుంది.
కాగా, సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (తొలి ఇన్నింగ్స్‌లో 101), విరాట్ కోహ్లి (సెకెండ్ ఇన్నింగ్స్‌లో 76), జస్ప్రీత్ బుమ్రా (4/69) మినహా భారత ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 245, సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ మాత్రమే బ్యాటింగ్ చేసి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లు వికెట్లు పడగొట్టేందుకు నానా అవస్థలు పడగా.. సఫారీ పేసర్లు టీమిండియా బ్యాటర్ల భరతం పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment