
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల గారాల పట్టి వామిక మరికొన్ని రోజుల్లో మొదటి పుట్టినరోజు జరుపుకోబోతోంది. జనవరి 11న రెండో వసంతంలో అడుగుపెట్టబోతోంది. అయితే, ఇప్పటి వరకు ఈ చిన్నారి రూపం ఎలా ఉంటుందో చూడాలన్న విరుష్క అభిమానుల ఆశ మాత్రం తీరలేదు. ఎప్పుడెప్పుడు ఆమెను తమకు పరిచయం చేస్తారా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో... వామికతో కలిసి ఉన్న ఫొటోలను అప్పుడప్పుడు షేర్ చేసే అనుష్క.. న్యూ ఇయర్ సందర్భంగా బుజ్జాయి గొంతును ఫ్యాన్స్‌కు వినిపించారు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లి తన భార్యాబిడ్డలతో కలిసి అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. సెంచూరియన్‌లో చారిత్రాత్మక విజయం తర్వాత అనుష్క, వామికాతో కలిసి సరాదాగా గడిపాడు. ఈ క్రమంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ‘‘2021లో చివరి సాయంత్రం ఎంతో అందంగా గడిచింది’’ అంటూ అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో ఓ వీడియో షేర్ చేశారు.
ఇందులో వామిక.. మమ్మా అంటూ ముద్దుముద్దుగా పలుకుతున్న మాటలు రికార్డయ్యాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విరుష్క అభిమానులు సందడి చేస్తున్నారు. ‘‘వామికా... మమ్మా అంటోంది.. సో క్యూట్.. డాడీ అని ఎప్పుడు పిలుస్తావు మరి.. నీ రూపం చూసేందుకు మేమంతా వెయిటింగ్.. వామిక తల్లి ఫొటో షేర్ చేయండి వదినా’’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాగా జనవరి 3 నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టుకు కోహ్లి సిద్ధమవుతున్నాడు.
చదవండి: IPL 2022 Auction: ఆంధ్రా క్రికెటర్‌కు వేలంలో మంచి ధర పలకడం ఖాయం!
Comments
Please login to add a commentAdd a comment