Virat Kohli Video-Call Anushka Sharma Returning From-Match Show-In Fans - Sakshi
Sakshi News home page

Virat Kohli: 'అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా.. డిస్టర్బ్‌ చేయకండి'

Published Thu, Sep 29 2022 4:42 PM | Last Updated on Thu, Sep 29 2022 5:51 PM

Virat Kohli Video-Call Anushka Sharma Returning From-Match Shows-It Fans - Sakshi

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్య చేధనలో రోహిత్‌, కోహ్లిలు విఫలమైనప్పటికీ.. కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌లు అర్థశతకాలతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకముందు టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, దీపక్‌ చహర్‌లు తొలి మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను శాసించారు. వీరికి తోడు హర్షల్‌ పటేల్‌, అక్షర్‌ పటేల్‌లు చెలరేగడంతో ప్రొటిస్‌ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.

ఇదిలా ఉంటే మ్యాచ్‌ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. అయితే హోటల్‌ బయట అప్పటికే అభిమానులు భారీగా గూమిగూడారు. భారత్‌ క్రికెటర్లు బస్సు ఎక్కగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్‌ వచ్చింది.

'' కోహ్లి.. కోహ్లి'' అంటూ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆ సమయంలో కోహ్లి.. తన భార్య అనుష్క శర్మతో ఫోన్‌లో వీడియో కాల్‌లో ఉన్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లి వెంటనే బస్సు అద్దంలో నుంచి.. ''అనుష్కతో వీడియో కాల్‌లో ఉన్నా.. డిస్టర్బ్‌ చేయకండి'' అంటూ ఫోన్‌ చూపిస్తూ నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 అక్టోబర్‌ 2న(ఆదివారం) జరగనుంది. 

చదవండి: నా జీవితంలో ఆరోజును మర్చిపోలేను: కోహ్లి ఉద్వేగం.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement