టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెటర్‌గా ఉన్నాడు. ఒకప్పుడు సచిన్, ధోనిలు చూసిన సంపద వైభోగాన్ని ఇప్పుడు కోహ్లి చూస్తున్నాడు. లెక్కలేనన్ని ఎండార్స్‌మెంట్లు, యాడ్స్‌తో కోట్లు సంపాదిస్తున్నాడు. అయితే ఆసియా ఖండంలో మాత్రం కోహ్లి రెండో ధనవంతమైన ఆటగాడిగా నిలిచాడని స్పోర్టికో అనే సంస్థ తమ రిపోర్టులో వెల్లడించింది.
2022 ఏడాదిలో రూ.277 కోట్లు సంపాదించిన కోహ్లి.. ఓవరాల్‌గా అత్యంత ధనవంతమైన ఆటగాళ్ల జాబితాలో 61వ స్థానంలో నిలిచాడు. ఇక టాప్-100 లిస్ట్‌లో కోహ్లి మినహా ఏ క్రికెటర్ చోటు సంపాదించలేకపోయాడు. మరి ఆసియా ఖండం నుంచి టాప్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరని ఆరా తీస్తే జపాన్‌కు మహిలా టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా అని తేలింది. 2022 ఏడాదిలో ఈ మాజీ యూఎస్ ఓపెన్ ఛాంపియన్ రూ. 434 కోట్లకు పైగా అర్జించినట్లు రిపోర్టులో వెల్లడించింది.
రిపోర్ట్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఆర్ధిక ఆదాయం రూ. 1050 కోట్లు అని తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లికి ఐకాన్ హోదాలో రూ. 15 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక టీమిండియా విషయానికి వస్తే.. ఒక టెస్టు మ్యాచ్‌కు కోహ్లి ఫీజు రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ. ఆరు లక్షలు.. అలాగే టి20 మ్యాచ్‌కు రూ. 3లక్షలు ఫీజు రూపంలో తీసుకుంటాడు. ఇక బీసీసీఐ అతనికి ఏప్లస్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఈ లెక్కన కోహ్లికి వార్షిక కాంట్రాక్ట్ కింద ఏడాదికి రూ. 7 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక టీమిండియా మాజీ కెప్టెన్.. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆర్థిక ఆదాయం రూ.1040 కోట్లకు పైమాటే.
ఇక 2022 ఏడాదిలో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో ఎన్‌బీఏ స్టార్ లెబ్రన్ జేమ్స్ రూ.1037 కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. లియోనల్ మెస్సీ రూ.997 కోట్లతో రెండో స్థానం, క్రిస్టియానో రొనాల్డో రూ. 939 కోట్లతో మూడో స్థానం, నెయ్‌మర్ రూ. 843 కోట్లతో నాలుగో స్థానం.. ఇక టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్ రూ.727 కోట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.
చదవండి: ఒక్క మ్యాచ్ ఆడగానే కెప్టెన్‌ను చేసేశారు.. ఇంటర్ మియామి సారధిగా మెస్సీ
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment