పాకిస్థానీ మహిళకు క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు
పాకిస్థానీ మహిళకు క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు
Published Tue, Feb 14 2017 9:13 AM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM
భారతదేశం తరఫున ఆడటం.. ఆ జెర్సీ ధరించి వెళ్లడం అంటేనే గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. సరిగ్గా ఇదే విషయంలో ఓ పాకిస్థానీ మహిళ అడిగిన ప్రశ్నకు భారతీయ క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు. ముస్లిం అయి ఉండి భారతదేశం తరఫున ఎందుకు ఆడుతున్నావని ఇర్ఫాన్ పఠాన్‌ను ఓ పాకిస్థానీ మహిళ ప్రశ్నించింది. దానికి ''భారతదేశం తరఫున ఆడటం నాకు గర్వకారణం'' అని సమాధానం ఇచ్చాడు. అప్పట్లో పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో ఇర్ఫాన్ కూడా సభ్యుడు.
బరోడాకు చెందిన ఈ ఆల్‌రౌండర్ అలనాటి ఈ ముచ్చటను ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకున్నాడు. చిట్టచివరిసారిగా 2012 అక్టోబర్ నెలలో పఠాన్ ఒక టి20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ఆడాడు. పాకిస్థానీ మహిళతో మాట్లాడిన తర్వాత తన కెరీర్ మరింత మెరుగ్గా ఉందని చెప్పాడు. మళ్లీ జట్టులోకి రావడం మాత్రం అంత సులభం కాదని ఇర్ఫాన్ అంటున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోనీ జట్టయిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ ఆడుతున్నాడు. చాలాకాలంగా దూరంగా ఉన్నా, మళ్లీ ఎప్పటికైనా భారత జెర్సీ వేసుకోకపోతానా అనే ఆశ మాత్రం ఇర్ఫాన్‌లో కనిపిస్తోంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, టి20లు ఆడాడు. మొట్టమొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ చేసిన ఏకైక అంతర్జాతీయ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. 2006లో కరాచీలో పాకిస్థాన్ మీద జరిగిన టెస్టులో అతడు ఈ ఫీట్ సాధించాడు.
Advertisement