befitting reply
-
భారత్‌ది శాంతిమంత్రమే.. కానీ!
న్యూఢిల్లీ: శాంతిమంత్రాన్నే భారత్ బలంగా విశ్వసిస్తుందని.. శాంతి పూర్వక సంబంధాలను ఏర్పాటుచేసుకునేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొ న్నారు. అయితే.. శాంతి కోసం దేశ సార్వభౌమత్వం, ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మాసాంతపు మన్‌కీబాత్ ప్రసంగంలో.. కొంతకాలంగా పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యలు, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే ప్రయత్నాలకు భారత భద్ర తా బలగాలు దీటైన సమాధానం చెబుతాయని మోదీ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమం ద్వారా.. అక్టోబర్ 12న రజతోత్సవం జరుపుకోనున్న ఎన్హెచ్ఆర్సీకీ, అక్టోబర్ 8న వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనున్న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రచ్ఛన్నయుద్ధానికి దీటైన సమాధానం పిరికితనంతో ప్రచ్ఛన్నయుద్ధం చేస్తున్న శక్తులకు భారత బలగాలు ఇచ్చిన దిమ్మదిరిగే సమాధానమే 2016 సెప్టెంబర్ నాటి సర్జికల్ స్ట్రైక్స్ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ ఎప్పుడూ అన్యాయంగా ఇతరుల భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు. చేయదు కూడా’ అని ప్రధాని స్పష్టం చేశారు. పరాక్రమ్ పర్వ్‌ను జరుపుకోవడం ద్వారా దేశ యువతకు సైనికుల పరాక్రమం గుర్తుచేసినట్లవుతుందన్నారు. గోల్డెన్ గ్లోబ్ రేసులో పాల్గొంటూ.. తుపానులో పడవ పాడైనా నడిసంద్రంలో మనోస్థైర్యాన్ని కనబరిచిన నేవీ కమాండర్ అభిలాష్ టామీని ప్రశంసించారు. సహకార విధానమే ప్రత్యామ్నాయం పెట్టుబడి దారీ విధానం, సామ్యవాదాలకు సహకార విధానమే సరైన ఆర్థిక ప్రత్యామ్నాయ పద్ధతి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లో అముల్ డెయిరీ సహకార ఉద్యమ వ్యవస్థాపకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను గుర్తుచేస్తూ.. ఆర్థికాభివృద్ధిలో ప్రజల సహకారాన్ని ఆనాడే ఆయన అమలు చేశారని ప్రశంసించారు. గుజరాత్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి అనంతరం ఆనంద్‌లో ఏర్పాటుచేసిన సభలో మోదీ ప్రసంగించారు. ‘దేశవ్యాప్తంగా సహకార సంస్థల ఏర్పాటు అత్యావశ్యకం. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానంగా సహకార వ్యవస్థ ఎదగాలి. వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడమే రైతుల సమస్యలకు అసలైన పరిష్కారం. మేం ఈ దిశగానే పనిచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ముఖ్వాజా గ్రామంలో సౌరశక్తి సహకార సొసైటీ ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించి.. ఈ దిశగా చొరవతీసుకున్న 11 మంది రైతులను అభినందించారు. అముల్ సంస్థ రూ.533 కోట్లతో ఏర్పాటుచేసిన చాక్లెట్ ప్లాంట్‌ను రిమోట్ కంట్రోల్‌తో ప్రధాని ప్రారంభించారు. ఆనంద్ వర్సిటీలో రూ.8కోట్లతో ఏర్పాటుచేసిన ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను, రూ.20కోట్లతో నిర్వహించనున్న విద్య డెయిరీ ఐస్ క్రీమ్ ప్లాంట్ల ప్రారంభించారు. అనంతరం కచ్ జిల్లా అంజార్‌లో రూ. 6,216కోట్లతో నిర్మించిన పాలన్పూర్–పాలీ–బార్మర్ గ్యాస్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. దేశానికే పేరుతెచ్చిన గాంధీ, పటేల్, అంబేడ్కర్ వంటి మహనీయుల త్యాగాలను తక్కువచేసి చూడటాన్ని మానుకోవాలని కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. ‘నన్ను 24 గంటలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇబ్బందేం లేదు. కానీ మహనీయులపై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయొద్దు’ అని సూచించారు. సరోవర్ డ్యాం సమీపంలో ఏర్పాటుచేయనున్న పటేల్ విగ్రహంపై రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ ఈ విమర్శలు చేశారు. ‘గ్రీన్ అవార్డు’కు మహాత్ముడే అర్హుడు అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ మహాత్ముడిని స్మరించుకున్నారు. మన్‌కీ బాత్‌లో.. గుజరాత్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా దేశానికి మార్గదర్శనం చేస్తున్న గాంధీ ఆలోచనలను ప్రధాని ప్రస్తావించారు. గాంధీ జీవితంలో పారిశుద్ధ్యం అత్యంత ముఖ్యమైన భాగమని ప్రధాని గుర్తుచేశారు. ఐక్యరాజ్యసమితి ‘చాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్’ (గ్రీన్) అవార్డుకు జాతిపితే అసలైన అర్హుడని పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటుచేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌లు సంయుక్తంగా ఐరాస గ్రీన్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘చాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు అందుకునేందుకు మహాత్మాగాంధీయే సరైన వ్యక్తి. పారిశుద్ధ్యమా? స్వాతంత్య్రమా అనే ప్రశ్న ఎదురైతే.. ముందు పారిశుద్ధ్యానికే మొగ్గుచూపారాయన’ అని అన్నారు. గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 15నుంచి ప్రారంభం కానున్న ‘స్వచ్ఛతే సేవ’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
పాకిస్థానీ మహిళకు క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు
భారతదేశం తరఫున ఆడటం.. ఆ జెర్సీ ధరించి వెళ్లడం అంటేనే గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. సరిగ్గా ఇదే విషయంలో ఓ పాకిస్థానీ మహిళ అడిగిన ప్రశ్నకు భారతీయ క్రికెటర్ దిమ్మతిరిగే జవాబు ఇచ్చాడు. ముస్లిం అయి ఉండి భారతదేశం తరఫున ఎందుకు ఆడుతున్నావని ఇర్ఫాన్ పఠాన్‌ను ఓ పాకిస్థానీ మహిళ ప్రశ్నించింది. దానికి ''భారతదేశం తరఫున ఆడటం నాకు గర్వకారణం'' అని సమాధానం ఇచ్చాడు. అప్పట్లో పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో ఇర్ఫాన్ కూడా సభ్యుడు. బరోడాకు చెందిన ఈ ఆల్‌రౌండర్ అలనాటి ఈ ముచ్చటను ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకున్నాడు. చిట్టచివరిసారిగా 2012 అక్టోబర్ నెలలో పఠాన్ ఒక టి20 మ్యాచ్‌లో భారత జట్టు తరఫున ఆడాడు. పాకిస్థానీ మహిళతో మాట్లాడిన తర్వాత తన కెరీర్ మరింత మెరుగ్గా ఉందని చెప్పాడు. మళ్లీ జట్టులోకి రావడం మాత్రం అంత సులభం కాదని ఇర్ఫాన్ అంటున్నాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంఎస్ ధోనీ జట్టయిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌లో ఈ లెఫ్టార్మ్ పేసర్ ఆడుతున్నాడు. చాలాకాలంగా దూరంగా ఉన్నా, మళ్లీ ఎప్పటికైనా భారత జెర్సీ వేసుకోకపోతానా అనే ఆశ మాత్రం ఇర్ఫాన్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఇర్ఫాన్ పఠాన్ 29 టెస్టులు, 120 వన్డేలు, టి20లు ఆడాడు. మొట్టమొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ చేసిన ఏకైక అంతర్జాతీయ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. 2006లో కరాచీలో పాకిస్థాన్ మీద జరిగిన టెస్టులో అతడు ఈ ఫీట్ సాధించాడు. -
తెలుగు తమ్ముళ్లకు పెద్దావిడ షాక్
-
తెలుగు తమ్ముళ్లకు పెద్దావిడ షాక్
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. తల్లి మనసుతో బిడ్డ లాంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా ముద్దాడుతున్న ఓ పెద్దావిడను ఉద్దేశించి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నోటికి వచ్చినట్లు కారుకూతలు రాయడంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం చేసుకునేవాళ్లకు తల్లిప్రేమ గురించి ఏం తెలుస్తుందని ఈ ఘటనపై పలువురు మండిపడ్డారు. వైయస్ జగన్‌ను అప్యాయంగా ముద్దుపెట్టుకున్న వైనం గురించి నోటికొచ్చినట్లు వాగిన తెలుగు తమ్ముళ్లకు నోరు మూయించేలా చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారు ఈ పెద్దావిడ. ఆవిడేమన్నారో ఆవిడ మాటల్లోనే చదవండి... ''నాకు ముగ్గురు కొడుకులు. ఒకడికి 45, మరొకడికి 40, ఇంకొకడికి 35 ఏళ్లున్నాయి. నా వయసు ఎంతో, నా పిల్లల వయసు ఎంతో అర్థం చేసుకోండి. పాపపు మాటలు మాట్లాడకండి. నా బిడ్డలాంటోడు మా ఊరు వచ్చాడు, మా పల్లెటూరు వచ్చాడు. మేం ఆ దేశం వెళ్లి ఆ మారాజును చూడలేమని, మా దగ్గరకు వచ్చాడని ఆప్యాయంగా వెళ్లాను. అంతే గానీ, రాజకీయం అయితే మేం చూడనే చూడం. ఎవరైనా చూడం, మాకు ఎవరైనా ఒకటే. మనం ఆవేళ వేసేది ఒక్కే ఓటు. ఇవన్నీ మాకేం తెలుస్తాయి? మీరనుకునేవన్నీ చెత్తమాటలు. చెత్త రాయద్దు. చెత్తమాటలు రాశారా పాపం కట్టుకుపోతారు. జరిగిన వాస్తవం రాసుకోండి. నా వయసు ఏంటో గుర్తుంచుకోండి. వాడి తల్లిలాంటిదాన్నని చెప్పు. నన్ను అవమానిస్తే వాడి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు కాదు, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లు అవుతుంది. రాసేటప్పుడు వయసును బట్టి రాయాలి మీరు. ఏదో చేతికి వచ్చేసిందని రాయకూడదు.'' -
పాక్‌పై విరుచుకుపడ్డ భారత సైన్యం
పాక్ సైనిక బలగాలు భారతీయ సైనికుడి శరీరాన్ని ఛిద్రం చేయడం, మరో ఇద్దరిని హతమార్చిన ఘటన ఒక్కసారిగా భారత సైన్యం రక్తాన్ని ఉడికించింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌పై భారీ స్థాయిలో దాడులతో విరుచుకుపడ్డారు. దీటుగా సమాధానం ఇవ్వడం తమకు తెలుసని స్పష్టం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతం మొత్తం తుపాకుల మోతతో దద్దరిల్లింది. పూంఛ్, రాజౌరి, కేల్, మచిల్.. ఇలాంటి ప్రాంతాలన్నీ హాట్ జోన్లుగా మారిపోయాయి. మంగళవారం నాడు పాకిస్థానీ కమాండోలు ఒక సైనికుడి తల నరికి, మరో ఇద్దరిని కూడా హతమార్చారు. మచిల్ ప్రాంతంలో నియంత్రణరేఖను దాటి వచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులను పాక్ కమాండోలు చుట్టుముట్టారు. ఈ సెక్టార్లో భారత, పాకిస్థానీ సైనిక పోస్టులు దగ్గరగా ఉంటాయి. దానికితోడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు ఉండటంతో ఉగ్రవాదులు లేదా సైనికులు చొరబడటం సులభం అవుతుంది. మూడు వారాల క్రితమే అదే ప్రాంతంలో మరో సైనికుడిని కూడా తల నరికి చంపారు. ఈ పిరికిపందల చర్యకు గట్టి ప్రతీకారం ఉండి తీరుతుందని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్థానీ ఆర్మీ పోస్టుల మీద దాడికి భారత సైన్యం 120 ఎంఎం హెవీ మోర్టార్లను, మిషన్ గన్లను ఉపయోగించింది. అయితే, భారత సైన్యం తమమీద ఎలాంటి దాడి చేయలేదని పాకిస్థాన్ అంటోంది. -
యుద్ధం కోరుకోం.. రెచ్చగొడితే గట్టి సమాధానం
భారతదేశం ఎవరితోనూ యుద్ధాన్ని లేదా సంఘర్షణను ఎప్పటికీ కోరుకోదని.. కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం వారికి గట్టి సమాధానం చెబుతామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఇటీవల మన జవాన్లు చెప్పిన సమాధానమే అందుకు ఉదాహరణ అన్నారు. ఇతరులను పదే పదేప విసిగించేందుకు కూడా కొంతమంది జనం ఉంటారని, వాళ్లను తాము నిశ్శబ్దంగానే డీల్ చేస్తామని అన్నారు. మన ఆర్మీ కూడా నిశ్శబ్దంగానే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని వెంకయ్య చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలను విడుదల చేయాలన్న ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల డిమాండ్లను ప్రస్తావిస్తూ అలాంటివాళ్లు చేసే బాధ్యతారహితమైన వ్యాఖ్యలకు, డిమాండ్లకు స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు. దేశంలోని మరే ఇతర పౌరుడికి భారత సైన్యం నిబద్ధత మీద అనుమానాలు ఉండి ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు.