తెలుగు తమ్ముళ్లకు పెద్దావిడ షాక్
తెలుగు తమ్ముళ్లకు పెద్దావిడ షాక్
Published Fri, Feb 3 2017 4:06 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. తల్లి మనసుతో బిడ్డ లాంటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆప్యాయంగా ముద్దాడుతున్న ఓ పెద్దావిడను ఉద్దేశించి సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నోటికి వచ్చినట్లు కారుకూతలు రాయడంతో ఆమెకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యాపారం చేసుకునేవాళ్లకు తల్లిప్రేమ గురించి ఏం తెలుస్తుందని ఈ ఘటనపై పలువురు మండిపడ్డారు. వైయస్ జగన్‌ను అప్యాయంగా ముద్దుపెట్టుకున్న వైనం గురించి నోటికొచ్చినట్లు వాగిన తెలుగు తమ్ముళ్లకు నోరు మూయించేలా చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారు ఈ పెద్దావిడ. ఆవిడేమన్నారో ఆవిడ మాటల్లోనే చదవండి...
''నాకు ముగ్గురు కొడుకులు. ఒకడికి 45, మరొకడికి 40, ఇంకొకడికి 35 ఏళ్లున్నాయి. నా వయసు ఎంతో, నా పిల్లల వయసు ఎంతో అర్థం చేసుకోండి. పాపపు మాటలు మాట్లాడకండి. నా బిడ్డలాంటోడు మా ఊరు వచ్చాడు, మా పల్లెటూరు వచ్చాడు. మేం ఆ దేశం వెళ్లి ఆ మారాజును చూడలేమని, మా దగ్గరకు వచ్చాడని ఆప్యాయంగా వెళ్లాను. అంతే గానీ, రాజకీయం అయితే మేం చూడనే చూడం. ఎవరైనా చూడం, మాకు ఎవరైనా ఒకటే. మనం ఆవేళ వేసేది ఒక్కే ఓటు. ఇవన్నీ మాకేం తెలుస్తాయి? మీరనుకునేవన్నీ చెత్తమాటలు. చెత్త రాయద్దు. చెత్తమాటలు రాశారా పాపం కట్టుకుపోతారు. జరిగిన వాస్తవం రాసుకోండి. నా వయసు ఏంటో గుర్తుంచుకోండి. వాడి తల్లిలాంటిదాన్నని చెప్పు. నన్ను అవమానిస్తే వాడి తల్లిని అవమానించినట్లే. రాసిన వాడు నన్ను అవమానించినట్లు కాదు, వాడి తల్లిని, వాడి చెల్లిని, వాడి అక్కను అవమానించినట్లు అవుతుంది. రాసేటప్పుడు వయసును బట్టి రాయాలి మీరు. ఏదో చేతికి వచ్చేసిందని రాయకూడదు.''
Advertisement
Advertisement