నిర్మల్: భారీ వర్షం, వరదలకు ముంపునకు గురైన బోల్సా గ్రామంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. నీట మునిగిన ఇళ్లను, కొతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరదలతో నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.
ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ కొతకు గురైన రోడ్లుకు మరమ్మతు చేపట్టేలా చూస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో పంట నష్టం సర్వే నిర్వహించి బాధితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వారివెంట డీఎల్‌పీవో శివకృష్ణ , మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, నాయకులు పోతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోపీనాథ్, గ్రామస్తులు ఉన్నారు.
భారీ వాహనాలను అనుమతించొద్దు
అర్లి వంతెన నుంచి భారీ వాహనాలను అనుమతించొద్దని కలెక్టరు వరుణ్‌రెడ్డి సూచించారు. హవర్గ గ్రామ సమీపంలోని అర్లి వంతెనను శుక్రవారం పరిశీలించారు. వంతెనకు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు.
సుద్దవాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీవో సోలమాన్‌రాజ్, విద్యుత్ ఏఈ శివకుమార్, ఆర్‌ఆండ్‌బీ డీఈ కొండయ్య, స్థానిక సర్పంచ్ భూజంగ్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment