
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(68)కి శుక్రవారం ఢిల్లీలోని ఏయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఉదయం అస్వస్థతతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించగా.. పరీక్షలు జరిపిన వైద్యులు వెంకయ్య గుండెకు సంబంధించిన ఓ నాళం పూడుకుపోతున్నట్లు గుర్తించారు.
ఏయిమ్స్ కార్డియాలజీ ప్రెఫెసర్ డాక్టర్ బలరాం భార్గవ నేతృత్వంలో యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు.. పూడుకుపోతున్న నాళంలో స్టెంట్ వేశారు. ప్రస్తుతం వెంకయ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అంతకుముందు, ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక జరిపిన పరీక్షల్లో వెంకయ్యనాయుడు గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment